Breaking News : హైదరాబాద్‌లో మాల్స్ మిన‌హా అన్ని షాపుల‌కు అనుమ‌తి..

|

May 27, 2020 | 11:07 PM

హైదరాబాద్‌లో లాక్ డౌన్‌ను పూర్తి స్థాయిలో సడలిస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్ మినహా అన్ని షాప్స్ తెరిచేందుకు ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. కొవిడ్‌పై ప్రభుత్వాలు నిర్దేశించిన రూల్స్ పాటిస్తూ షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల ముందు జనం గుంపులు గుంపులుగా ఉండవద్దని కేసీఆర్ సూచనలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ […]

Breaking News : హైదరాబాద్‌లో మాల్స్ మిన‌హా అన్ని షాపుల‌కు అనుమ‌తి..
Follow us on

హైదరాబాద్‌లో లాక్ డౌన్‌ను పూర్తి స్థాయిలో సడలిస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్ మినహా అన్ని షాప్స్ తెరిచేందుకు ప్రభుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చింది. కొవిడ్‌పై ప్రభుత్వాలు నిర్దేశించిన రూల్స్ పాటిస్తూ షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల ముందు జనం గుంపులు గుంపులుగా ఉండవద్దని కేసీఆర్ సూచనలు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో జూన్ 1 నుంచి 8 వరకు పరిశుభ్రత – పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణతో పాటు, రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని కోరారు. పల్లెల్లో, పట్టణాల్లో జూన్ మొదటి వారంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కేటి రామారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులను సిఎం వివరించారు.
– మురికి కాలువలను శుభ్రం చేసి మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టాలి. వర్షపు నీరు, వృధాగా పోయే నీరు నిలువకుండా గుంతలను మొరంతో నింపాలి. మెయిన్ రోడ్లు, గ్రామాల్లోని రోడ్ల గుంతలను పూడ్చాలి. రోడ్లపై ఎలాంటి నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలి.
– నీటి పైపు లైన్ల లీకేజీలుంటే గమనించి వాటిని సరిచేయించాలి. లీకేజీలతో నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలి.
– ఓవర్ హెడ్ ట్యాంకులు, భూ గర్భ నీటి ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు, మెటల్ డ్రమ్ములు, మట్టి గంగాళాలు, వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకుల్లో దోమల లార్వాలను నాశనం చేసే జాగ్రత్తలు తీసుకోవాలి
– అన్ని నివాసాల్లో ఫాగింగ్ చేపట్టాలి
– దోమల లార్వాలను నశింపచేసే బైటెక్స్ స్ప్రే చేయించటంతో పాటు ఆయిల్ బాల్స్ ను నిరంతరంగా ప్రయోగిస్తూ ఉండాలి
– ఖాళీ ప్రదేశాల్లో చెత్తను, పొదలను, పనికిరాని అటవీ సంబంధిత మొక్కలను తొలిగించి శుభ్రతను పర్యవేక్షించాలి
– బస్టాండ్లు, మార్కెట్లు, స్కూళ్ళ పరిసరాలు, హాస్పటళ్ళ పరిసరాలు, రేషన్ షాపులు, బండ్ల స్టాండ్లలో 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ఫెనాలిక్ డిస్ ఇన్ఫెక్టెంట్ తో పిచికారి చేయించాలి.