తిరుమల : వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం

|

Jan 04, 2020 | 4:21 PM

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రోజుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని నేరుగా దర్శించుకోవాలనుకునే భక్తుల కొరకు 2,500 టోకెన్లను రిలీజ్ చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీ వాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే భక్తులకు ఈ టికెట్లను అందించనున్నారు. రూ. 10 వేలు విరాళంగా ఇచ్చే భక్తులకు వీఐపీ కేటగిరీలో […]

తిరుమల : వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్దం
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us on

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా రోజుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని నేరుగా దర్శించుకోవాలనుకునే భక్తుల కొరకు 2,500 టోకెన్లను రిలీజ్ చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శ్రీ వాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇచ్చే భక్తులకు ఈ టికెట్లను అందించనున్నారు. రూ. 10 వేలు విరాళంగా ఇచ్చే భక్తులకు వీఐపీ కేటగిరీలో నేరుగా వైకుంఠ ద్వార దర్శనం చేయించనున్నారు.

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపిన మరిన్ని విషయాలు :

  • -6వ తేదీన పూజా కైంకర్యాల అనంతరం మొదటగా విఐపీలు, అనంతరం ఉదయం 5 గంటలకు సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి
  • ఉదయం 9 నుండి 11 గంటల మద్య శ్రీవారి స్వర్ణరథం
  •  7వ తేది ఉదయం 6 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం
  • వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే  భక్తుల సౌకర్యార్థం నిర్విరామంగా అన్నప్రసాదాలు వితరణ, ప్రత్యేక మెడికల్ టీమ్స్, 3 లక్షల వాటర్ బాటిళ్లు సదుపాయం
  • రద్దీ దృష్ట్యా నేటి నుండి 7వ తేదీ వరకు సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలు రద్దు
  • టీటీడీ చైర్మన్‌తో సహా ప్రతిఒక్కరు సామన్యభక్తుడి తరహాలోనే స్వామివారిని దర్శించుకోవాలి
  •  విఐపీలకు లఘు, మిగతా అందరికీ మహాలఘు దర్శనం ఉంటుంది
  •  వైకుంఠద్వారాలు పది రోజులు తెరవాలని కోర్టులో పబ్లిక్ ఇంట్రస్ట్ పిల్ దాఖలైంది
  • తుదినిర్ణయం తీసుకోమని కోర్టు టీటీకి కోర్టు ఆదేశాలు. ఈనెల 6న  జరగబోయే పాలకమండలి సమావేశంలో వైకుంఠద్వారాలు ఎన్నిరోజులు తెరవాలనే అంశంపై స్పష్షత వచ్చే అవకాశం
  •  రూ.కోటి 70 లక్షలతో ఏకాదశి పనులు
  • లక్షా 80వేల మంది భక్తలకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించే అవకాశం