రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు

| Edited By:

Oct 13, 2019 | 5:35 PM

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే అఖలపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బహిరంగ మద్దతు ప్రకటించాయి. మృతిచెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీ తమ సంతాపాన్ని తెలిపింది. కార్యాచరణలో భాగంగా ఈనెల 19న జరపనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు కూడా మద్దతునిచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మరికొన్ని […]

రేపు ఖమ్మం జిల్లా బంద్.. అఖిలపక్షం పిలుపు
Follow us on

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే అఖలపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బహిరంగ మద్దతు ప్రకటించాయి. మృతిచెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీ తమ సంతాపాన్ని తెలిపింది. కార్యాచరణలో భాగంగా ఈనెల 19న జరపనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు కూడా మద్దతునిచ్చింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మరికొన్ని డిమాండ్లతో జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధి నిర్వహణకు హాజరుకాని ఉద్యోగులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టే అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడపై ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహంతో పాటు తీవ్ర ఆవేదన కూడా రగిల్చింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి శనివారం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మ‌ృతి చెందారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికి నిరసనగా సోమవారం ఖమ్మం జిల్లా బంద్‌ను పాటించాలని జేఏసీ నేతలతో పాటు అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు.