కరువు బారిన అన్నదాత! నీకెవరు దిక్కు?

| Edited By: Srinu

May 15, 2019 | 5:31 PM

రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొంది. సకాలంలో వర్షాలు పడక రైతులు వేసిన పంటలు ఎండిపోయాయి. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి పోయాయి. పశువులు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. నీటి వసతి ఉన్న చోట అక్కడక్కడ వరి నార్లు పోసుకున్నారు. బోరు బావులు ఎండిపోవడంతో వరి పొలాలు సైతం బీడుబారాయి. ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కంటతడి పెడుతున్నారు. సుడితెగులు, ఆకుముడత వల్ల వరి పంటకు […]

కరువు బారిన అన్నదాత! నీకెవరు దిక్కు?
Follow us on

రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొంది. సకాలంలో వర్షాలు పడక రైతులు వేసిన పంటలు ఎండిపోయాయి. వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి పోయాయి. పశువులు తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. నీటి వసతి ఉన్న చోట అక్కడక్కడ వరి నార్లు పోసుకున్నారు. బోరు బావులు ఎండిపోవడంతో వరి పొలాలు సైతం బీడుబారాయి. ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కంటతడి పెడుతున్నారు. సుడితెగులు, ఆకుముడత వల్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి దారు ణంగా ఉంది. కాలం తారు మారైంది. వర్షాలు పడే సమయంలో వెనక్కి వెళ్తున్నాయి. రైతులు పంట కోసే సమయంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతుకు రెండు విధాలుగా నష్టం వాటిల్లుతుంది. అతివృష్టి, అనావృష్టి బారిన పడుతున్నారు.

ఎస్సారెస్పీలోకి నీరు రాకపోవడం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజ్‌కి చేరుకోవడంతో నీటి నిల్వలను మంచినీటికే ఉపయోగించాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది నిండుగా కళకళలాడిన చెరువులు, కుంటల్లోనూ ఇప్పుడు నీళ్లు లేవు. ఈ ప్రభావం పంటలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతా ల్లో సరిగా వర్షాలు కురవకపోవడంతో కొన్నింటికి వరద నీరు రాలేదు. ఎగువన వర్షాలు సమృద్ధిగా కురిసినా.. ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి మరికొన్ని ప్రాజెక్టులకు నీటిని వదలడం లేదు. ఈ సీజన్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి కనీస నీటి ప్రవాహాలు కూడా నమోదు కాలేదు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుది ఇదే పరిస్థితి. మహారాష్ట్రలో వర్షాలు పడకపోవడంతో కిందికి నీటిని వదల్లేదు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం బాగా తగ్గింది. ప్రాజెక్టు పరిధిలో నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లోని 9.2 లక్షల ఎకరాలు సాగవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికే తప్ప సాగునీటికి నీరందించే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టులనే నమ్ముకొని సాగుచేసిన భూములు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి.