ఉద్యోగులూ వెంటనే విధుల్లో చేరండి… సీఎస్ ఆదేశాలు!

| Edited By:

Aug 08, 2019 | 9:13 PM

ఆర్టికల్ 370 రద్దుతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం క్రమంగా పరిస్థితిని చక్కదిద్దుతోంది. ఉద్యోగులు వెంటనే తమ విధుల్లో చేరాలంటూ ఇవాళ జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. డివిజినల్ స్థాయి, జిల్లా స్థాయి సహా అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, శ్రీనగర్‌లోని సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కావాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు విధుల్లోకి చేరేందుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. […]

ఉద్యోగులూ వెంటనే విధుల్లో చేరండి... సీఎస్ ఆదేశాలు!
Follow us on

ఆర్టికల్ 370 రద్దుతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం క్రమంగా పరిస్థితిని చక్కదిద్దుతోంది. ఉద్యోగులు వెంటనే తమ విధుల్లో చేరాలంటూ ఇవాళ జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. డివిజినల్ స్థాయి, జిల్లా స్థాయి సహా అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, శ్రీనగర్‌లోని సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కావాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు విధుల్లోకి చేరేందుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. వారి భద్రతకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకున్నామని వివరించారు. శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పునఃప్రారంభించాలని సీఎస్ స్పష్టం చేశారు.

కాగా శ్రీనగర్‌కు చెందిన సీనియర్ పోలీస్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఆర్పీఎఫ్ డీజీతో కలిసి సీఆర్పీఎఫ్ శిబిరాన్ని సందర్శించారు. కశ్మీర్‌ లోయలోని భద్రతా పరిస్థితులపైనా సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు, తదనంతరం విధించిన ఆంక్షలపై కార్గిల్‌లో ఆందోళన చేపట్టిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో 300 మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసన కారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.