అల్ -ఖైదాకి దెబ్బ.. దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతం

| Edited By: Srinu

Oct 09, 2019 | 7:06 PM

అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. గత నెల 23 న హెల్మండ్ ప్రావిన్స్ లోని మూసా-ఖలా జిల్లాలో తాలిబన్ల కాంపౌండ్ లోనే మృతి చెందినట్టు వార్తలు అందుతున్నాయి. ఉమర్ పాకిస్తానీ అని ఆప్ఘన్ లోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. అయితే […]

అల్ -ఖైదాకి దెబ్బ.. దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతం
Follow us on

అల్-ఖైదా దక్షిణాసియా చీఫ్ ఆసిం ఉమర్ హతమయ్యాడు. గత నెల దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్-ఆఫ్ఘన్ దళాలు జరిపిన సంయుక్త దాడుల్లో ఉమర్ మరణించాడు. 2014 నుంచి భారత ఉపఖండంలో అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతగాడు.. గత నెల 23 న హెల్మండ్ ప్రావిన్స్ లోని మూసా-ఖలా జిల్లాలో తాలిబన్ల కాంపౌండ్ లోనే మృతి చెందినట్టు వార్తలు అందుతున్నాయి. ఉమర్ పాకిస్తానీ అని ఆప్ఘన్ లోని నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. అయితే ఇతడు ఇండియాలో పుట్టాడని కూడా వార్తలు వచ్చాయి. మరో అయిదుగురు సభ్యులతో బాటు ఉమర్ హతమయ్యాడని, ఈ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు పాకిస్థానీయులని తెలుస్తోంది. అయితే ఉమర్ మరణించాడన్న సమాచారాన్ని ఆఫ్ఘన్ తాలిబన్లు ఖండించారు. ఇది శత్రువుల దుష్ప్రచారమని, నమ్మదగినదిగా లేదని వారు పేర్కొన్నారు.
గత నెల 22.. 23 తేదీలలో జరిగిన ‘ ఓవర్ నైట్ ఆపరేషన్ ‘ కు సంబంధించి పరస్పర విరుధ్ధమైన వార్తలు వస్తున్నాయి. యుఎస్ వైమానిక దళాలు కూడా జరిపిన ఆ దాడుల్లో ఉమర్ హతమయ్యాడట. పైగా ఆ ఆపరేషన్ లో పిల్లలతో సహా 40 మంది పౌరులు కూడా మృతి చెందినట్టు వఛ్చిన వార్తలపై ‘ దర్యాప్తు ‘ జరుపుతామని యుఎస్ అధికారులు అంటున్నారు. దళాల ఉపసంహరణ విషయంలో అమెరికా -తాలిబన్ మధ్య సంప్రదింపులు నిలిచిపోయినప్పటికీ..తమ సైనికులను వెనక్కి తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. అయితే ఓ షరతు విధించింది. తాలిబన్లు అల్-ఖైదాతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని, సెక్యూరిటీ గ్యారంటీలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఏమైనా-ఆసిం ఉమర్ నిజంగా హతమయ్యాడా, లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావలసి ఉంది.