కాలుష్య కోరల్లో ప్రధాన నగరాలు..గాలి పీలిస్తే ప్రాణాలు హుష్ కాకి

|

Nov 26, 2019 | 10:12 AM

స్వచ్చమైన గాలిని కూడా త్వరలో కేజీల లెక్కన కొనుక్కొని..భుజాన పెట్టుకుని పీల్చుకుంటూ తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు కూడా మొదలయ్యాయి.  అంటే అక్కడికి వెళ్లి ఫ్యూర్ ఆక్సిజన్‌‌ను డబ్బులు చెల్లించి కాసేపు ఆస్వాదించి రావాలి అన్నమాట. దీన్ని బట్టే అర్థమవుతోంది కాలుష్య కోరలు మానవ మనుగడకు తీవ్ర సంకటంగా మారాయనేది. రకరకాల ఫ్యాక్టరీలతో పాటు రోజురోజుకు పెరిగిపోతోన్న వాహనాలు మనిషి ఆరోగ్య వ్యవస్థపై, జీవన పరిణామంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. […]

కాలుష్య కోరల్లో ప్రధాన నగరాలు..గాలి పీలిస్తే ప్రాణాలు హుష్ కాకి
Follow us on

స్వచ్చమైన గాలిని కూడా త్వరలో కేజీల లెక్కన కొనుక్కొని..భుజాన పెట్టుకుని పీల్చుకుంటూ తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు కూడా మొదలయ్యాయి.  అంటే అక్కడికి వెళ్లి ఫ్యూర్ ఆక్సిజన్‌‌ను డబ్బులు చెల్లించి కాసేపు ఆస్వాదించి రావాలి అన్నమాట. దీన్ని బట్టే అర్థమవుతోంది కాలుష్య కోరలు మానవ మనుగడకు తీవ్ర సంకటంగా మారాయనేది. రకరకాల ఫ్యాక్టరీలతో పాటు రోజురోజుకు పెరిగిపోతోన్న వాహనాలు మనిషి ఆరోగ్య వ్యవస్థపై, జీవన పరిణామంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలు ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకోని సతమతమవుతున్నాయి. ఈ నగరాల్లో.. కార్బన్‌మోనాక్సైడ్‌,  కార్బన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి వాయివులు గాలిని పూర్తి కలుషితంగా మార్చేశాయి. ప్రమాదకరమైన విషయం ఏంటంటే ప్రధాన నగరాలలో గత ఐదేళ్ల కాలంలో.. గాలిలో  కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయి 30 శాతం మేర పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడమే. వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో సంభవిస్తున్న మరణాలు ఐదవ స్థానంలో ఉన్నాయి. ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది వాయు ప్రమాద ఘంటికలు ఏ స్థాయిలో ఉన్నాయో..!

వాయికాలుష్యం వల్ల వచ్చే ప్రధాన జబ్బులు:

మెదడు సంబంధిత వ్యాధులు: కాలుష్యం ప్రధానంగా మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగ పీల్చడం వల్ల మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, బ్లాకులుగా ఏర్పడటం జరుగుతోంది. దీనివల్ల పక్షవాతం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, హార్డ్‌ స్ట్రోక్‌ వంటి ప్రమాదకరమైన రోగాలు సంభవిస్తున్నాయి.

ఉపిరితిత్తుల సమస్యలు: రోజూ పేపర్స్‌లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలో గాలి పీలిస్తే..పదుల సంఖ్యలో సిగరెట్లు తాగినంత ప్రమాదం అని. అంటే సిగరెట్ల కంటే ప్రమాదకర స్థాయిలో రోజూ పీల్చే గాలి.. మన ఆరోగ్య వ్యవస్థను నాశనం చేస్తోంది. ముఖ్యంగా ఇటువంటి గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వెంటాడుతున్నాయి. కాబట్టి కాలుష్య రహిత భారత్ దిశగా అడుగులు వేయాలి. ప్రభుత్వాలతో పాటు ప్రజల్లోనూ మార్పు అవసరం.