బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో దొరికిన పైలట్!

| Edited By:

Jul 15, 2019 | 7:42 PM

ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ పైలట్ ఢిల్లీ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిగా వెళ్లాలనని అనుకున్నాడు. అయితే ఆ విమానం నిండిపోవడంతో.. అదనపు క్రూ మెంబర్‌గా కాక్‌పిట్‌లో వెళ్తానంటూ విజ్ఞప్తి చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ సిబ్బంది ప్రయాణించేందుకు ఎయిరిండియా అనుమతిస్తుంది. అయితే అందుకు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పైలట్ అప్పటికే మద్యం సేవించి రావడంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిపోయాడు. దీంతో వెంటనే అతడిని విమానం దించేసిన అధికారులు.. అతడి వ్యవహారాన్ని […]

బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో దొరికిన పైలట్!
Follow us on

ఎయిర్ ఇండియాకు చెందిన సీనియర్ పైలట్ ఢిల్లీ నుంచి బెంగళూరుకు సాధారణ ప్రయాణికుడిగా వెళ్లాలనని అనుకున్నాడు. అయితే ఆ విమానం నిండిపోవడంతో.. అదనపు క్రూ మెంబర్‌గా కాక్‌పిట్‌లో వెళ్తానంటూ విజ్ఞప్తి చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ సిబ్బంది ప్రయాణించేందుకు ఎయిరిండియా అనుమతిస్తుంది. అయితే అందుకు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పైలట్ అప్పటికే మద్యం సేవించి రావడంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలో దొరికిపోయాడు. దీంతో వెంటనే అతడిని విమానం దించేసిన అధికారులు.. అతడి వ్యవహారాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దృష్టికి తీసుకెళ్లారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం ఆ పైలట్‌‌పై మూడు నెలలు సస్పెన్షన్ వేటు పడినట్టు ఎయిరిండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. భద్రత విషయంలో రాజీపడ కూడదన్న ఉద్దేశంతోనే విధుల నుంచి దూరం పెట్టినట్టు తెలిపాయి.