చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై ఐలయ్య ఆగ్రహం.. ఏమన్నారంటే?

|

Nov 27, 2019 | 4:13 PM

ఏపీలో ఇంగ్లీషు మీడియం రగడ ఒకవైపు కొనసాగుతుండగానే దానికి మరింత ఆజ్యం పోసే కామెంట్లు చేశారు ప్రొ.కంచె ఐలయ్య. ఇంగ్లీషుని ప్రోత్సహించాల్సిన అవసరం వుందంటూనే ఆయన చేసిన కామెంట్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కాక రేపుతున్నాయి. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం వుందంటూనే మంచి భవిష్యత్తుకు ఇంగ్లీషు భాషా పరిఙ్ఞానం అవసరమని కంచె ఐలయ్య అంటున్నారు. ఇదే క్రమంలో ఐలయ్య చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ బడులలో ఒకటి నుంచి ఆరో […]

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై ఐలయ్య ఆగ్రహం.. ఏమన్నారంటే?
Follow us on

ఏపీలో ఇంగ్లీషు మీడియం రగడ ఒకవైపు కొనసాగుతుండగానే దానికి మరింత ఆజ్యం పోసే కామెంట్లు చేశారు ప్రొ.కంచె ఐలయ్య. ఇంగ్లీషుని ప్రోత్సహించాల్సిన అవసరం వుందంటూనే ఆయన చేసిన కామెంట్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కాక రేపుతున్నాయి. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం వుందంటూనే మంచి భవిష్యత్తుకు ఇంగ్లీషు భాషా పరిఙ్ఞానం అవసరమని కంచె ఐలయ్య అంటున్నారు. ఇదే క్రమంలో ఐలయ్య చేసిన కామెంట్లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నాయి.

ఏపీలోని ప్రభుత్వ బడులలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మాధ్యమంలో బోధనను జగన్ ప్రభుత్వం కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని టిడిపి, జనసేనతోపాటు పలువురు తప్పు పడుతున్నారు. అదే సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో మేధావుల మాటలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ పర్యటనకు వచ్చిన ప్రొ.కంచె ఐలయ్య ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు కంచె ఐలయ్య. ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటేనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడగలుగుతారని ఐలయ్య అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంచె ఐలయ్య సమర్థించారు. కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు అవసరమని ఆయన చెబుతున్నారు. ఇంగ్లీషు మీడియంను సమర్థించడం ఏమో గానీ.. ఐలయ్య చేసిన పొలిటికల్ కమెంట్లిప్పుడు ఏపీలో హీటు రగిలిస్తున్నాయి. ఐలయ్యపై టిడిపి, జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.