కాంగ్రెస్‌లో కలకలం.. మరో కీలక నేత రాజీనామా

| Edited By:

Jun 29, 2019 | 7:12 PM

కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలతో రాజీనామాల పర్వం మొదలైంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 140 మందకి పైగా కీలక నేతలు వారి పదవులకు రాజీనామా చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. తాజాగా శనివారం మరో కీలక నేత […]

కాంగ్రెస్‌లో కలకలం.. మరో కీలక నేత రాజీనామా
Follow us on

కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఘోర పరాజయానికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలతో రాజీనామాల పర్వం మొదలైంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 140 మందకి పైగా కీలక నేతలు వారి పదవులకు రాజీనామా చేశారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. తాజాగా శనివారం మరో కీలక నేత రాజీనామా చేశారు.

ఏఐసీసీ సెక్రెటరీ, రాజస్థాన్ కో- ఇన్‌చార్జీ తరుణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి రాహుల్‌కు ఓ లేఖ రాశారు. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి కో- ఇన్‌చార్జీగా ఉన్న తానూ ఓ కారణమేనని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చడానికి కార్యకర్తలందరూ కష్టపడ్డారు. అయితే మన ఫలితాలు మాత్రం మన అంచనాలకు విరుద్ధంగా వచ్చాయి. ఈ వైఫల్యానికి అందరూ బాధ్యత వహించాల్సిందేనని తరుణ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక తెలంగాణలో కూడా రాజీనామాల పర్వం మొదలైంది. శుక్రవారం పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయగా.. శనివారం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేశారు. అదే బాటలో మరికొందరు నేతలు కూడా రాజీనామా లేఖలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.