ఇంజెక్షన్‌ రూపంలో ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ డ్రగ్

|

Oct 08, 2020 | 2:51 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి నుంచి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడంలేదు. కానీ, ఇప్పటి వరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ ఔషధం ఇంజెక్షన్‌ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇంజెక్షన్‌ రూపంలో ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ డ్రగ్
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి నుంచి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడంలేదు. కానీ, ఇప్పటి వరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ ఔషధం ఇంజెక్షన్‌ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. భారత్‌లో ఇప్పటికే కొవిడ్‌ చికిత్సలో అత్యధికంగా ఫావిపిరవిర్‌ యాంటీ వైరల్‌ డ్రగ్ ను వినియోగిస్తున్నారు. తాజాగా దీనిని రోగులు మరింత సౌకర్య వంతంగా తీసుకొనేలా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్‌ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇంజెక్షన్‌ రూపంలో ఫావిపిరవిర్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేస్తోంది.

సాధారణంగా కొవిడ్‌ 14 రోజుల చికిత్సలో 122 ఫావిపిరవిర్‌ 200 ఎంజీ టాబ్లెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని టాబ్లెట్లను మింగడం రోగికి సమస్యగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత నెలలో ఈ సంస్థ టాబ్లెట్ల కోర్సులో వాడే సంఖ్యను 32కు తగ్గించింది. 800 ఎంజీ/200 ఎంజీ కాంబినేషన్ల మాత్రలను అందుబాటులోకి తెచ్చింది. డ్రగ్ వాడకానికి సంబంధించిన రెగ్యులేటరీ అనుమతులు కూడా ఆ సంస్థ ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. ‘‘ప్రస్తుతం ఫావిపిరవిర్‌ను ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పేషెంట్లకు మెరుగైన చికిత్సను అందించేందుకు ఉపయోగపడుతుంది’ అని హైదరాబాద్‌ డ్రగ్‌కంట్రోలర్‌ అడ్మిని‌స్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.నవీన్‌ కుమార్‌ ఆంగ్ల పత్రికకు తెలిపారు. మరికొన్ని వారాల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తద్వారా టాబ్లెట్ల వాడకం దాదాపు తగ్గుతుందన్నారు.