ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

|

Dec 12, 2020 | 6:53 PM

మాములుగా అయితే నిత్యం అన్నదానాలు జరిగే ఆలయాల్లో లేదా ప్రజలు అధిక సంఖ్యలో వెళ్లే హోటల్స్ లేదా రెస్టారెంట్స్‌లో పెద్ద, పెద్ద రోటీ మేకర్ మెసీన్స్ దర్శనమిస్తూ ఉంటాయి.

ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు
Follow us on

మాములుగా అయితే నిత్యం అన్నదానాలు జరిగే ఆలయాల్లో లేదా ప్రజలు అధిక సంఖ్యలో వెళ్లే హోటల్స్ లేదా రెస్టారెంట్స్‌లో పెద్ద, పెద్ద రోటీ మేకర్ మెసీన్స్ దర్శనమిస్తూ ఉంటాయి. తక్కువ సయయంలో ఎక్కువ రోటీలు తయారు చేసేందుకు వీటిని వినియోగిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తోన్న రైతులు కూడా ఓ భారీ రోటీ మేకర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వంటల భారాన్ని తగ్గించేందకు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ యంత్రం గంటకు దాదాపుగా 1500 నుంచి 2000 చపాతీలను తయారు చేస్తుంది. సదరు యంత్రానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  గోధుమపిండి కలిపి, ముద్దలుగా చేసి యంత్రంలో వేస్తే చాలు.. బాగా కాలిన చపాతీలు యంత్రం నుంచి బయటకు వస్తున్నాయి. మెషిన్ లోపలే పిండి రొట్టెగా మారుతోంది. ఆ తరువాత ముందు భాగంలో ఉన్న మంటపై అవి కాలి బయటకు వస్తున్నాయి.

తాజాగా ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

తాజాగా ఆందోళన స్థలంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల కోసం ఫుట్ మసాజర్లు,  తాత్కాలిక జిమ్‌లను ఏర్పాటు చేశారు. రైతుల్లో చాలామంది వృద్ధులు ఉన్న నేపథ్యంలో వారు ఆరోగ్యంగా ఉండేలా అంతర్జాతీయ ఎన్జీఓ ఖల్సా ఎయిడ్ ఢిల్లీ సరిహద్దుల వద్ద ఫుట్ మసాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒక గుడారం లోపల సుమారు 25 యంత్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు 10 నిమిషాల చొప్పున సెషన్‌కు ఆహ్వానిస్తున్నారు. మొదటి రోజునే 500 మంది రైతులు ఈ సేవను ఉపయోగించుకున్నారు. ఖల్సా ఎయిడ్ ఫౌండేషన్ రైతుల కోసం టీ, స్నాక్స్ కూడా అందిస్తోంది.  నిరసన స్థలంలో మహిళా రైతుల కోసం  20 మొబైల్ మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు.