ఓరుగల్లులో షురూ కానున్న లోకల్ వార్.. ఇక అందరి దృష్టి గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల పైనే..!

|

Dec 10, 2020 | 9:30 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయి... ఇక అందరి దృష్టి గ్రేటర్‌ వరంగల్‌ పైనే పడింది. త్వరలో వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగనున్నాయి..

ఓరుగల్లులో షురూ కానున్న లోకల్ వార్.. ఇక అందరి దృష్టి గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల పైనే..!
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయి… ఇక అందరి దృష్టి గ్రేటర్‌ వరంగల్‌ పైనే పడింది. త్వరలో వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని అధికారులు- రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం 2021 మార్చి 11వ తేదీతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్ర నూతన పురపాలక చట్టం ప్రకారం మూడు నెలల ముందుగా లేదా మూణ్నెళ్ల తర్వాత నిర్వహించుకునే వీలుంది. కొత్త చట్టంలో పొందుపర్చిన విధంగా వరంగల్‌ మున్సిపల్ కార్పోరేషన్ లోని 58 డివిజన్ల నుంచి 66 పెంచే అవకాశం ఉంది.

కొత్త డివిజన్ల పునర్విభజనపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై డిసెంబర్ నెలాఖరు వరకు ఉత్తర్వులు ఇస్తే నిబంధనల ప్రకారం డివిజన్ల పునర్విభజన ప్రక్రియ 21-25 రోజుల్లో పూర్తి చేసే వీలుంటుంది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి లో వరంగల్ మహా నగరంలో ఎన్నికల నగారా మొగనుంది. హైదరాబాద్ ఫలితాల నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఓరుగల్లు పై ఆశలు పెంచుకుంటున్నాయి.