ఏపీ ‘దిశ’గా ఢిల్లీ, ఒడిశా!

| Edited By:

Dec 17, 2019 | 11:17 AM

ఏపీలో ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ‘దిశ’ చట్టం అమలుపై సభను అభినందించారు. అందరూ చట్టాన్ని ప్రశంసిస్తున్నారని అన్నారు. దిశ చట్టం ప్రతులను పంపమని ఒడిశా ప్రభుత్వం కోరినట్లు స్పీకర్ తెలిపారు. దిశ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం చెప్పింది” అని స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు దిశ చట్టం ప్రతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు […]

ఏపీ దిశగా ఢిల్లీ, ఒడిశా!
Follow us on

ఏపీలో ఏడవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ‘దిశ’ చట్టం అమలుపై సభను అభినందించారు. అందరూ చట్టాన్ని ప్రశంసిస్తున్నారని అన్నారు. దిశ చట్టం ప్రతులను పంపమని ఒడిశా ప్రభుత్వం కోరినట్లు స్పీకర్ తెలిపారు. దిశ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం చెప్పింది” అని స్పీకర్ పేర్కొన్నారు. మరోవైపు దిశ చట్టం ప్రతుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం.

దిశ చట్టాన్ని ఆమోదించినందుకు గర్వంగా ఉందని సీతారాం పేర్కొన్నారు. మహిళలను దారుణమైన నేరాల నుండి రక్షించడానికి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం ప్రకారం, చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలతో దోషిగా తేలిన నేరస్థుడికి నేరం జరిగిన 21 రోజుల్లో కఠిన శిక్ష విధించబడుతుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి.