ఐసిస్ టాప్ కమాండర్ ‌ను అరెస్టు చేసిన ఆఫ్ఘన్ దళాలు..

| Edited By: Pardhasaradhi Peri

Apr 22, 2020 | 9:05 PM

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు బుధవారం ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఖొరసాన్ విభాగం టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను

ఐసిస్ టాప్ కమాండర్ ‌ను అరెస్టు చేసిన ఆఫ్ఘన్ దళాలు..
Follow us on

కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు బుధవారం ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఖొరసాన్ విభాగం టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను అరెస్టు చేశాయి. మునీబ్ పాకిస్థాన్ దేశీయుడని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్) తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్ – ఖొరసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్ అత్యంత కీలకమైన ఉగ్రవాది అని ఎన్‌డీఎస్ తెలిపింది.

కాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థలైన లష్కరే తొయిబా, హక్కానీ నెట్‌వర్క్, సిపా-ఈ-సహబా, జమాత్-ఉల్-ఉలేమా-ఈ-ఇస్లామ్ వంటివాటితో మునీబ్‌ అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నాడని, వీటన్నిటికీ ఓ వారథిలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపింది. ఉగ్రవాద సంస్థలు, నిఘా వ్యవస్థల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. మునీబ్ డాయిష్ గ్రూప్‌లో చేరడానికి ముందు అల్‌ఖైదాలో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది.