ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనను తిరస్కరించిన అదితి రావు హైదరీ

|

Jul 09, 2020 | 2:44 PM

ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పును హీరోయిన్​ అదితిరావు హైదరీ ప్రశంసించారు. ఒక కాస్మెటిక్ బ్రాండ్ తమ ఉత్పత్తి పేరు నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని వదిలివేసింది. దీనిపై అదితి రావు...

ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనను తిరస్కరించిన అదితి రావు హైదరీ
Follow us on

Aditi Rao Hydari had rejected fairness cream ad : ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పును హీరోయిన్​ అదితిరావు హైదరీ ప్రశంసించారు. ఒక కాస్మెటిక్ బ్రాండ్ తమ ఉత్పత్తి పేరు నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని వదిలివేసింది. దీనిపై అదితి రావు హైదరీ మాట్లాడుతూ.. తమ తరంలో వారు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉన్నారు అని అన్నారు. అందం అంటే రంగు ఒక్కటే కాదని.. ఇది ఇప్పుడిప్పుడే తెలుస్తోందని అన్నారు.

తన కెరీర్ తొలినాళ్లలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రకటనలో నటించేందుకు అవకాశం వచ్చిదని అయితే నేను నటించేందుకు నిరాకరించాను. అయితే తాను అందులో నటించి ఉంటే తన కెరీర్‌లో పెద్ద మార్పు వచ్చి ఉండేదని అన్నారు.  చలన చిత్రేతర కుటుంబం నుంచి తాను రావడం వల్ల ఆ యాడ్ ఓ మంచి అవకాశంగా ఉండివుండేదని.. కానీ నేను చేయలేదు అని హైదరీ చెప్పారు.