సమంత న్యూ ట్విస్ట్.. ఈ సారి మామూలుగా లేదుగా..!

| Edited By:

Aug 16, 2019 | 8:57 AM

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని దూకుడు పెంచింది. నాగచైతన్యతో వివాహం తర్వాత గ్లామర్ పాత్రలకు గుడ్ బై చెప్పిన.. సమంత తన ఇమేజ్‌కు తగిన పాత్రలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని ఏర్పరచుకుంది. ఇప్పటికే తన భర్త నాగ చైతన్యతో చేసిన మజిలీ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఓ బేబితో తన సత్తా చాటింది. ఒకవైపు అక్కినేని ఇంటి కోడలిగా ముందు వెనుక ఆలోచించి సినిమా కథలను ఎన్నుకుంటోంది. తాజాగా సమంత.. […]

సమంత న్యూ ట్విస్ట్.. ఈ సారి మామూలుగా లేదుగా..!
Follow us on

వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని దూకుడు పెంచింది. నాగచైతన్యతో వివాహం తర్వాత గ్లామర్ పాత్రలకు గుడ్ బై చెప్పిన.. సమంత తన ఇమేజ్‌కు తగిన పాత్రలతో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని ఏర్పరచుకుంది. ఇప్పటికే తన భర్త నాగ చైతన్యతో చేసిన మజిలీ సినిమాతో మెమరబుల్ హిట్ అందుకున్న సమంత.. ఆ తర్వాత ఓ బేబితో తన సత్తా చాటింది. ఒకవైపు అక్కినేని ఇంటి కోడలిగా ముందు వెనుక ఆలోచించి సినిమా కథలను ఎన్నుకుంటోంది. తాజాగా సమంత.. తన దృష్టిని వెబ్ సిరీస్ పై మళ్లించనున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు సినిమాలు కాకుండా వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఇపుడు అదే రూట్లో సమంత వెళ్లబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత నటించబోయే ఈ వెబ్ సిరీస్ తెలుగు,హిందీ, తమిళంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఏదే మైనా ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.