రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

| Edited By:

Aug 12, 2020 | 3:24 PM

న‌టి రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే, అటు స‌మాజానికి త‌న‌వంతు ఏదైనా చ‌యాల‌ని ల‌క్ష్యంతో ముందు కెళ్తున్నారు. తాజాగా రేణు మ‌రో చ‌క్క‌టి సందేశంతో వార్త‌ల్లో నిలిచారు. కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో భాగంగా త‌న రెండు ల‌గ్జ‌రీ కార్ల‌ను..

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!
Follow us on

న‌టి రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూనే, అటు స‌మాజానికి త‌న‌వంతు ఏదైనా చ‌యాల‌ని ల‌క్ష్యంతో ముందు కెళ్తున్నారు. తాజాగా రేణు మ‌రో చ‌క్క‌టి సందేశంతో వార్త‌ల్లో నిలిచారు. కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో భాగంగా త‌న రెండు ల‌గ్జ‌రీ కార్ల‌ను అమ్మేసిన‌ట్లు ఆవిడ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. మారిష‌స్‌లో చ‌మురు లీకేజీ వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని గుర్తు చేస్తూ.. పెట్రోల్‌, డీజిల్ వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

‘ద‌య‌చేసి అంద‌రూ ఎల‌క్ట్రిక్ కార్లు, బైకులను కొనే ప‌నిలో ప‌డండి. ప్ర‌తీ రోజూ వాడే డీజిల్, పెట్రోల్‌కు ప్ర‌త్యామ్నాయ వ‌న‌రుల‌ను అన్వేషించండి. నేను ఇంధ‌నంతో న‌డిచే ఆడీ ఏ6, పోర్ష బాక్సర్ కార్ల‌ను అమ్మేసి.. ఈ ఎల‌క్ట్రిక్ హ్యూండాయ్ కోన కారును తీసుకున్నా. నా రెండు కార్ల‌ను అమ్మ‌డం కాస్త క‌ష్ట‌మైన విష‌య‌‌యే అయినా మారిష‌స్‌లో జ‌రిగిన చ‌మురు లీకేజీ గురించి చ‌దివిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్నా. పెట్రోల్‌, డీజిల్ వంటి ఇంధ‌నాల‌తో ఈ భూమిపై నివ‌సించే జీవ‌రాశుల‌కు క్యాన్స‌ర్ అంటిస్తున్నాం. కాలుష్యాన్ని నియంత్రించాలంటే.. ఇంధ‌నంతో నడిచే వాహ‌నాల వాడ‌కాన్ని త‌గ్గించ‌డ‌మేన‌ని’ రేణు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా రేణు దేశాయ్ విజ్ఞ‌ప్తి మేర‌కు చాలా మంది నెటిజ‌న్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

Read More:

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి