రాకేష్ మాస్టర్‌కు నటి మాధవీలత లీగల్ నోటిస్…

|

May 27, 2020 | 3:21 PM

గత కొద్దిరోజులుగా రాకేష్ మాస్టర్ పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నారు. ఆయన టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నటి, బీజేపీ నేత మాధవీలతపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాధవీలత ఘాటుగా స్పందించారు. తన లాయర్ మన్నావ్ కుమార్ ద్వారా రాకేష్ మాస్టర్‌కు లీగల్ నోటిసులు పంపించారు. ఈ నెల 6వ తేదీన రెండు యూట్యూబ్ […]

రాకేష్ మాస్టర్‌కు నటి మాధవీలత లీగల్ నోటిస్...
Follow us on

గత కొద్దిరోజులుగా రాకేష్ మాస్టర్ పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నారు. ఆయన టాలీవుడ్ పరిశ్రమలోని పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నటి, బీజేపీ నేత మాధవీలతపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాధవీలత ఘాటుగా స్పందించారు. తన లాయర్ మన్నావ్ కుమార్ ద్వారా రాకేష్ మాస్టర్‌కు లీగల్ నోటిసులు పంపించారు.

ఈ నెల 6వ తేదీన రెండు యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు అప్ లోడ్ చేశారని.. ఆ వీడియోలలో తన క్లైంట్ మాధవీలతపై నిరాధారమైన, అసత్యపూరితమైన ఆరోపణలు చేయడమే కాకుండా, అసభ్యపదజాలంతో దూషించారని లీగల్ నోటిసులో అడ్వకేట్ పేర్కొన్నారు. అంతేకాకుండా తెలుగు సినిమా ప్రముఖులైన చిరంజీవి, బాలకృష్ణలతో మాధవీలతకు లింకులు పెట్టి ఆమె గౌరవానికి భంగం కలిగించారని వెల్లడించారు. ఇక ఈ తప్పుడు వ్యాఖ్యలన్నింటికీ రాకేష్ మాస్టర్ ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

లీగల్ నోటీసు వివరాలు…