పోలీసుల ముందుకు నటుడు శివాజీ..!

| Edited By: Srinu

Jul 11, 2019 | 12:59 PM

గత కొద్ది రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న టీవీ9 షేర్ల కొనుగోలు కేసులో నటుడు శివాజీ కాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కానున్నాడు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో శివాజీ పోలీసుల ముందుకు రానున్నాడు. టీవీ9 షేర్ల కొనుగోలు వ్యవహారంలో శివాజీ పై కేసు నమోదైంది. విచారణకు హాజరుకావాలని పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు శివాజీ స్పందించలేదు. దీంతో పోలీసులు అతనిపై లుక్ […]

పోలీసుల ముందుకు నటుడు శివాజీ..!
Follow us on

గత కొద్ది రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న టీవీ9 షేర్ల కొనుగోలు కేసులో నటుడు శివాజీ కాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కానున్నాడు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో శివాజీ పోలీసుల ముందుకు రానున్నాడు. టీవీ9 షేర్ల కొనుగోలు వ్యవహారంలో శివాజీ పై కేసు నమోదైంది. విచారణకు హాజరుకావాలని పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపారు.

అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు శివాజీ స్పందించలేదు. దీంతో పోలీసులు అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గతవారం అమెరికా పారిపోవడానికి శివాజీ ప్రయత్నించారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టును వెళ్లిన విషయాన్ని ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టులోనే శివాజీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక అదేరోజు విచారణకు హాజరుకావాలని నోటీసు పంపారు. ఈరోజు విచారణకు హాజరుకావాలని నోటీసులో పోలీసులు ఆదేశించారు.