Actor Deep Sidhu: పొడిగింపు, పంజాబ్ నటుడు దీప్ సిద్దుకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ, ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు.

| Edited By: Pardhasaradhi Peri

Feb 23, 2021 | 6:54 PM

రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ నటుడు దీప్ సిద్దుకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.

Actor Deep Sidhu: పొడిగింపు, పంజాబ్ నటుడు దీప్ సిద్దుకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ, ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు.
Follow us on

Actor Deep Sidhu:  రిపబ్లిక్ దినోత్సవం నాడు ఢిల్లీ ఎర్రకోట వద్ద అల్లర్లను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ నటుడు దీప్ సిద్దుకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఇతని 7 రోజుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఇతడిని పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ జిత్ కౌర్ ముందు హాజరు పరిచారు. రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన ఘటనలను ప్రోత్సహించినవారిలో సిద్దు కీలక వ్యక్తి అని పోలీసులు ఆరోపించిన విషయం గమనార్హం. అయితే ఈ ఆరోపణలు సరికాదని, రైతు సంఘ నాయకులే తన అరెస్టుకు కారణమని ఇతడు ఖండించాడు. కానీ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సిద్దును హర్యానాలోని కర్నాల్ లో అరెస్టు చేశారు. కాగా-2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ ఇతడిని తన  ఎన్నికల ప్రచారంలో వినియోగించుకున్నారు. కానీ ఆ తరువాత ఇతనితో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆ తరువాత  ఆయన ట్వీట్ చేశాడు.

2015 లో దీప్ సిద్దు చిత్ర రంగంలో ప్రవేశించాడు. తన తొలి  చిత్రంలోనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించాడు. సింగర్ గా కూడా పాపులర్ అయ్యాడు.

Also Read:

ఏసీబీ వలకు చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి.. రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూపరింటెండెంట్‌ పూల్‌సింగ్‌

ఎన్నికల ముందు, కేరళలో లెఫ్ట్ పార్టీలకు షాక్ ! 98 మంది బీజేపీలో చేరిక, 7 న రాష్ట్రానికి అమిత్ షా