ఈఎస్‌ఐ స్కామ్ : రెండో రోజు ముగిసిన అచ్చెన్నాయుడి విచారణ …

|

Jun 26, 2020 | 11:52 PM

ఈఎస్‌ఐ స్కామ్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో ఏసీబీ అధికారుల రెండో రోజు విచారణ ముగిసింది.

ఈఎస్‌ఐ స్కామ్ : రెండో రోజు ముగిసిన అచ్చెన్నాయుడి విచారణ ...
Follow us on

ఈఎస్‌ఐ స్కామ్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో ఏసీబీ అధికారుల రెండో రోజు విచారణ ముగిసింది. శుక్ర‌వారం రెండు దఫాలుగా సుమారు ఐదు గంటలపాటు అధికారులు విచారణ జరిపారు. ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు ప్రసాద్‌, చిరంజీవి నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ సమయంలో టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడితో పాటు ఆయన తరఫు న్యాయవాది హరిబాబు, డాక్ట‌ర్ ను అనుమతించారు. అచ్చెన్నాయుడిని శ‌నివారం కూడా విచారించనున్నారు. మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు రమేష్‌కుమార్‌, చక్రవర్తి, విజయ్‌కుమార్‌, జనార్దన్‌లను కూడా ఏసీబీ అధికారులు విజయవాడలో ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో ఒక్కొక్కరిని ఏసీబీ బృందం విడివిడిగా విచార‌ణ జ‌రిపింది. ఈ కుంభ‌కోణానికి సంబంధించి పరారీలో ఉన్న మరో 10 మంది కోసం స్పెష‌ల్ టీమ్స్ గాలింపు చేపట్టాయి.