ఆగిన ఆరోగ్యశ్రీ .. సర్కారీ దవాఖానాకు రోగులు క్యూ

| Edited By: Srinu

Aug 20, 2019 | 12:58 PM

తెలంగాణలో ప్రభుత్వాసుపత్రులకు రోగులు క్యూలు కడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు అల్లాడిపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని నిలిపివేశాయి. ఇప్పటికి నాలుగు రోజులైనా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆయా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జనం ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో సర్కార్ దవాఖానాల్లో సైతం వారికి తిరస్కారమే ఎదురవుతుంది. ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన […]

ఆగిన ఆరోగ్యశ్రీ .. సర్కారీ దవాఖానాకు రోగులు క్యూ
Follow us on

తెలంగాణలో ప్రభుత్వాసుపత్రులకు రోగులు క్యూలు కడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు అల్లాడిపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని నిలిపివేశాయి. ఇప్పటికి నాలుగు రోజులైనా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆయా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జనం ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో సర్కార్ దవాఖానాల్లో సైతం వారికి తిరస్కారమే ఎదురవుతుంది.

ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సోమవారం నిర్వహించాల్సిన నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం 236 ప్రైవేటు ఆస్పత్రలకు ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.3,44,17,50,892 బకాయిలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ లెక్క తమ లెక్కతో సరిపోవడం లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ విమర్శిస్తున్నాయి. అన్ని వివరాలు మంగళవారం జరిగే సమావేశంలో వెల్లడిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించి పేదలకు అందించే వైద్యసేవల్ని పునరుద్ధరించాలని అసోసియేషన్ విఙ్ఞప్తి చేసింది.