ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల!

| Edited By:

Jan 14, 2020 | 10:53 PM

అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 70 మంది అభ్యర్థులతో కూడిన పూర్తి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీ నుంచి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్పర్‌గంజ్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 46 మంది తిరిగి ఎన్నికల్లో పోటీ చేయనుండగా, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ పక్కన పెట్టినట్లు సమాచారం. తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నందున, ఆప్ కొత్త అభ్యర్థులకు […]

ఢిల్లీ ఎన్నికలకు.. ఆప్ అభ్యర్థుల జాబితా విడుదల!
Follow us on

అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 70 మంది అభ్యర్థులతో కూడిన పూర్తి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఢిల్లీ నుంచి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్పర్‌గంజ్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 46 మంది తిరిగి ఎన్నికల్లో పోటీ చేయనుండగా, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ పక్కన పెట్టినట్లు సమాచారం. తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నందున, ఆప్ కొత్త అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చింది. ఈ జాబితాలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. కొత్తగా బరిలో మాజీ కాంగ్రెస్ సభ్యులు షోయబ్ ఇక్బాల్ (మాటియా మహల్), ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ (చాందిని చౌక్), పార్టీ లోక్ సభ అభ్యర్థులు – దిలీప్ పాండే (తైమూర్పూర్), అతిషి (కల్కాజీ), రాఘవ్ చాధా (రాజిందర్ నగర్) ఉన్నారు.