రిటన్స్ వేయాలంటే ఆధార్, పాన్ అటాచ్ చేయాల్సిందే

| Edited By: Srinu

Mar 07, 2019 | 8:14 PM

దిల్లీ: ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్టులను అటాచ్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం తెలిపింది. మార్చి 31లోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని టాక్స్ పేయర్స్‌కు బోర్డు సూచించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 139AA ప్రకారం ఆదాయ పన్ను రిటర్నులకు.. ఆధార్, పాన్‌ కార్డుల అనుసంధానం తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 6న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆధార్‌ను బ్యాంకు […]

రిటన్స్ వేయాలంటే ఆధార్, పాన్ అటాచ్ చేయాల్సిందే
Follow us on

దిల్లీ: ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్టులను అటాచ్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం తెలిపింది. మార్చి 31లోగా ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని టాక్స్ పేయర్స్‌కు బోర్డు సూచించింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 139AA ప్రకారం ఆదాయ పన్ను రిటర్నులకు.. ఆధార్, పాన్‌ కార్డుల అనుసంధానం తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఫిబ్రవరి 6న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆధార్‌ను బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ ఫోన్లకు, పాఠశాల దరఖాస్తులకు అనుసంధానించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలోని పాన్‌కార్డులు కలిగిన వారిలో దాదాపు సగం మంది ఆధార్‌, పాన్‌లను అనుసంధానం చేయలేదని గత నెల జరిగిన ఓ సమావేశంలో సీబీడీటీ మాజీ ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర అన్నారు. ఆదాయపు పన్నుశాఖ 42కోట్ల పాన్‌ కార్డులను జారీ చేస్తే అందులో కేవలం 23కోట్ల పాన్‌ కార్డులు కలిగిన వారు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.