ఏపీలో అమూల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం జగన్.. అమూల్‌ ఒప్పందంతో రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం

| Edited By: Pardhasaradhi Peri

Dec 02, 2020 | 3:29 PM

ఏపీలో అమూల్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా  మూడు దశల్లో 6వేల 551 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసారు.

ఏపీలో అమూల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం జగన్.. అమూల్‌ ఒప్పందంతో రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం
Follow us on

ఏపీలో అమూల్ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా  మూడు దశల్లో 6వేల 551 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అమూల్ రాకతో రైతులకు అదనపు ఆదాయం చేకూరిందని అన్నారు. ఐఎఫ్సిఎస్ లో ప్రపంచంలో అమూల్ సంస్థ ఎనిమిదో స్థానంలో ఉందని, ఆడవాళ్లకు, అక్కచెల్లెళ్లకు అండగా ఉండే ఓ మూమెంట్ అమూల్ అని జగన్ అన్నారు. ‘జులై 21 న అమూల్ తో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం తర్వాత ఈ డైరీల పునరోద్ధరణ, వాటిని బలోపేతం చేయడానికి అమూల్ సంస్థ ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 9899 గ్రామాలల్లో పాల ఉత్పత్తి ఓ మోస్తదుగా ఉందో…ఆగ్రామాల్లో  బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ అదేవిధంగా ఆటోమేటిక్ పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు’. ఇందుకోసం సుమారు 3000 వేల కోట్ల రూపాయలను ఇందుకు ఖర్చుచేయనున్నట్టు జగన్ తెలిపారు.

ఇది మహిళలు జీవితకాలం ఆదాయం రావాలని అమూల్ సంస్థను తీసుకువచ్చి  9వేల 899  గ్రామాలల్లోబల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం.  ఇది మహిళలకు ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మిగిలిపోవాలనే దృక్పధంతో అమూల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చామన్నారు జగన్. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు జగన్  నగదును పంపిణీ చేయనున్నారు.