మౌత్‌వాష్‌తో.. ‘కరోనా వైరస్’కు అడ్డుకట్ట..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 09, 2020 | 12:12 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మౌత్‌వాష్‌ ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

మౌత్‌వాష్‌తో.. కరోనా వైరస్కు అడ్డుకట్ట..!
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మౌత్‌వాష్‌ ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కొరియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసన్ కు చెందిన శాస్త్రవేత్తలు.. 10 మిల్లీలీటర్ల క్లోరోహెక్సిడైన్‌ మౌత్‌వాష్‌ను 10 సెకండ్లపాటు వాడడం వల్ల లాలాజలంలోని వైరల్‌ లోడ్‌ రెండు గంటలపాటు గణనీయంగా తగ్గుతుందని, తద్వారా వైరస్‌ సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు.

కాగా.. రెండు గంటల తర్వాత వైరల్‌ లోడ్‌ మళ్లీ పెరిగినట్లు వారు పేర్కొన్నారు. లాలాజలంలో అధిక వైరల్‌ లోడ్‌ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ మౌత్‌వాష్‌ని వాడడం వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పరిశోధకులు వివరించారు. కొరియా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసన్‌ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ