విశాఖ సముద్రంలో బోటు బోల్తా

|

Jul 15, 2020 | 7:20 PM

విశాఖ జిల్లా సముద్రంలో ఓ నాటు పడవ బోల్తా పడింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులతో ఉన్న ఒక పడవ.. సముద్ర అలలకు తిరగబడింది. ఒడ్డుకు చేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు గల్లంతవగా.. ఏడుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వ్యక్తిని జగ్గా అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. గల్లంతైన జగ్గా […]

విశాఖ సముద్రంలో బోటు బోల్తా
Follow us on

విశాఖ జిల్లా సముద్రంలో ఓ నాటు పడవ బోల్తా పడింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్య్సకారులతో ఉన్న ఒక పడవ.. సముద్ర అలలకు తిరగబడింది. ఒడ్డుకు చేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు గల్లంతవగా.. ఏడుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వ్యక్తిని జగ్గా అని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. గల్లంతైన జగ్గా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వర్షాలు జోరుగా కురుస్తున్న సమయంలో సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. పడవ బోల్తా ఘటనలో గల్లంతైన జగ్గా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ద‌ృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌లో బంధించాడు.