టోల్ ప్లాజాలకు వరం.. ఫాస్టాగ్ విధానం: నితిన్ గడ్కరీ

| Edited By:

Oct 17, 2019 | 11:18 AM

జాతీయ రహదారుల్లో మార్పులు తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌‌‌‌‌‌‌‌ఐఐ) ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి అన్ని రహదారుల పై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అసలు ఫాస్టాగ్ విధానం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాల ఆధారంగా వాహనాల రాకపోకల నియంత్రణకు మార్గాన్ని సుగమం చేసే విధానం. ఢిల్లీలో నిర్వహించిన వన్ […]

టోల్ ప్లాజాలకు వరం.. ఫాస్టాగ్ విధానం: నితిన్ గడ్కరీ
Follow us on

జాతీయ రహదారుల్లో మార్పులు తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌‌‌‌‌‌‌‌ఐఐ) ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి అన్ని రహదారుల పై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అసలు ఫాస్టాగ్ విధానం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాల ఆధారంగా వాహనాల రాకపోకల నియంత్రణకు మార్గాన్ని సుగమం చేసే విధానం. ఢిల్లీలో నిర్వహించిన వన్ కంట్రీ వన్ ఫాస్టాగ్ కార్యక్రమంలో ప్రసంగించిన గడ్కరీ, ప్రస్తుతం జాతీయ రహదారులపై మొత్తం 527 టోల్ ప్లాజాలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 380 టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ విధానాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. మిగిలిన టోల్ ప్లాజాల వద్ద కూడా డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఫాస్టాగ్ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని.. ఇంధనం కూడా వృధా కాకుండా చూసుకోవచ్చన గడ్కరీ తెలిపారు. ఫాస్టాగ్ అనేది పారదర్శక వ్యవస్థ, ఇది టోల్ ప్లాజాను జామ్ చేయదు, ఎవరు ఏ వాహనంలో కూర్చున్నారో కూడా తెలుస్తుందని చెప్పారు. నేరాలను నియంత్రించడానికి హోం మంత్రిత్వ శాఖకు సహాయపడుతుందని.. ఇక ఇప్పుడు ఫాస్టాగ్ కూడా జీఎస్టీ నెట్ వర్క్‌కు అనుసంధానించబడిందన్నారు. ఇ-వే బిల్ వ్యవస్థను ఫాస్టాగ్‌కు అనుసంధానించడం ద్వారా రెవెన్యూ అధికారులు వాహనాల కదలికను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఫాస్టాగ్‌ను ఉపయోగించడం ద్వారా క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చుని గడ్కరీ స్పష్టం చేశారు.