లాక్‌డౌన్ నేపథ్యంలో.. యమునా నది ఒడ్డున 700 మంది వలస కార్మికులు..

| Edited By:

Apr 16, 2020 | 3:03 PM

కోవిద్-19 ధాటికి లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కడికెళ్లాలో తెలియని దాదాపు 700 మంది వలస కార్మీకులు, రోజువారీ కూలీలు యమునా నది ముంపు ప్రాంతంలో ఆశ్రయం తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో.. యమునా నది ఒడ్డున 700 మంది వలస కార్మికులు..
Follow us on

కోవిద్-19 ధాటికి లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కడికెళ్లాలో తెలియని దాదాపు 700 మంది వలస కార్మీకులు, రోజువారీ కూలీలు యమునా నది ముంపు ప్రాంతంలో ఆశ్రయం తీసుకుంటున్నారు. వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతుండడంతో నదీతీరంలోని యమున పుష్ట వద్ద ఓ బ్రిడ్జి కింద సేదదీరుతున్నారు. మంగళవారం ముంబైలోని బాంద్రాలో వందలాది మంది వలస కార్మికులు ఒకేచోట చేరిన ఫోటోలు వైరల్ కావడంతో కరోనా వ్యాపించే ముప్పు ఉందంటూ ఆందోళన రేగింది. ఢిల్లీలోని వలస కార్మికుల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వివిధ స్కూళ్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లకు వారిని తరలించారు.

కాగా.. ” వీరిలో దాదాపు 250 మంది యమునా ముంపు ప్రాంతంలో నివసించే వాళ్లే ఉన్నారు. వారంతా వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ సహాయక శిబిరాలకు వస్తారు. వరదలు తగ్గాక మళ్లీ అక్కడికే వెళ్లిపోతారు…’’ అని డీయూఎస్ఐబీ సభ్యుడు బిపిన్ రాయ్ పేర్కొన్నారు. కాగా ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగించడంతో మరికొంత మంది ఇక్కడికి వచ్చారనీ… రోజు రోజుకూ ఎండవేడిమి పెరుగుతుండడంతో బ్రిడ్జి కిందికి చేరినట్టు గుర్తించామన్నారు. వీరందర్నీ రోహిణి, సావ్‌దా ఘెవ్రా, ఘాజీపూర్ సహా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలించారు.

Also Read: వాహనదారులకు అలెర్ట్.. సైడ్ వ్యూ మిర్రర్స్ లేకున్నా జరిమానా..