ఆ ఏడు రాష్ట్రాల్లో.. జనాభా కంటే.. ఆధార్‌ కార్డులే ఎక్కువ!

| Edited By:

Feb 07, 2020 | 4:42 AM

ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పకుండ కావాల్సింది ఆధార్‌ కార్డు. ఎందుకంటే.. ఆధార్ లేకుండా ఏపనీ జరగదు. బ్యాంకు ఖాతా తెరిచే దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అమలయ్యేంత వరకు అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు ఉంటుంది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో జనాభా కంటే ఆధార్‌ కార్డులే ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రే చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా జనాభా కంటే ఆధార్‌ కార్డులు ఎక్కువగా ఉన్నాయా అని వేసిన […]

ఆ ఏడు రాష్ట్రాల్లో.. జనాభా కంటే.. ఆధార్‌ కార్డులే ఎక్కువ!
Follow us on

ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పకుండ కావాల్సింది ఆధార్‌ కార్డు. ఎందుకంటే.. ఆధార్ లేకుండా ఏపనీ జరగదు. బ్యాంకు ఖాతా తెరిచే దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అమలయ్యేంత వరకు అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు ఉంటుంది. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో జనాభా కంటే ఆధార్‌ కార్డులే ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రే చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా జనాభా కంటే ఆధార్‌ కార్డులు ఎక్కువగా ఉన్నాయా అని వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి సంజయ్‌ థోత్రీ సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

వలసలలో లోపం, అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని ఆయన రాజ్యసభకు తెలియజేశారు. ‘అవును.. ఉన్నాయ్‌. డిసెంబరు 31, 2019 నాటి అంచనా ప్రకారం ఏడు రాష్ట్రాల్లో జనాభా కంటే ఆధార్‌ కార్డులే ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన జవాబిచ్చారు. చనిపోయిన వారి ఆధార్‌ కార్డులు తొలగించకపోవడం వల్ల ఇలా జరగలేదని ఆయన వెల్లడించారు. అయితే ఆ ఏడు రాష్ట్రాలు ఏవి అనే విషయాన్ని మాత్రం కేంద్రమంత్రి చెప్పలేదు.