రిటైర్ అయిన ఈపిఎఫ్ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్…

|

Apr 29, 2020 | 2:30 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. మే నెల నుంచి 6.3 లక్షల మంది ఉద్యోగులకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ సమయంలో కమ్యూటేషన్‌ ఆప్షన్‌కి ఎంచుకున్నవార‌కే ఈ సౌల‌భ్యం ల‌భిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిదానాల‌ను ప‌రిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్ర‌క్రియ‌ను చేపట్టింది. కమ్యూటేషన్ అనేది పెన్ష‌న్ ల‌బ్దిదారుల‌కు ఇచ్చిన ఓ స్పెషల్ ఆప్షన్. దీన్ని ఎంపిక‌చేసుకున్న వారికి నెలవారీ వచ్చే పెన్షన్‌లో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి… ప‌ద‌వీ విర‌మ‌ణ సమయంలో… ఒకేసారి ఇస్తారు. […]

రిటైర్ అయిన ఈపిఎఫ్ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్...
Follow us on

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. మే నెల నుంచి 6.3 లక్షల మంది ఉద్యోగులకు పూర్తిస్థాయి పెన్షన్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ సమయంలో కమ్యూటేషన్‌ ఆప్షన్‌కి ఎంచుకున్నవార‌కే ఈ సౌల‌భ్యం ల‌భిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిదానాల‌ను ప‌రిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్ర‌క్రియ‌ను చేపట్టింది. కమ్యూటేషన్ అనేది పెన్ష‌న్ ల‌బ్దిదారుల‌కు ఇచ్చిన ఓ స్పెషల్ ఆప్షన్. దీన్ని ఎంపిక‌చేసుకున్న వారికి నెలవారీ వచ్చే పెన్షన్‌లో కొంత మొత్తాన్ని పక్కన పెట్టి… ప‌ద‌వీ విర‌మ‌ణ సమయంలో… ఒకేసారి ఇస్తారు. ఈపీఎస్‌ నిబంధన‌ల‌ ప్రకారం 2008 సెప్టెంబర్ 26కి ముందు రిటైర్ అయిన ఈపిఎఫ్ఓ మెంబర్ ఒకేసారి మూడింట ఒక వంతు డబ్బును పెన్షన్ అమౌంట్‌గా పొందగలరు. మిగతా రెండొంతుల డ‌బ్బును జీవితకాలం పాటూ… నెలవారీ పెన్షన్‌గా ఇస్తారు.

ఈపిఎఫ్ఓకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్…పోయిన ఏడాది ఆగస్టు 21న జ‌రిగిన మీటింగ్ లో ఓ ప్రతిపాదనను ఆమోదించారు. అది ఏంటంటే.. 2008 సెప్టెంబర్ 26కి ముందు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌వారికి కోతలు లేకుండా పూర్తిస్థాయి నెలవారీ పింఛ‌న్ ఇవ్వాలని నిర్ణయించారు. ఐతే… ఇలా పొందాలనుకునేవారు… పెన్షన్ కమ్యూటేషన్ ఆప్షన్‌కి స‌మ్మ‌తి తెలియ‌జేయాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.1500 కోట్ల భారం పడనున్న‌ట్లు తెలుస్తోంది.