అమెరికాలో భారీ తుపాను.. ఐదుగురు మృతి

| Edited By:

Feb 09, 2020 | 5:02 AM

అమెరికాలోని నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, పశ్చిమ వర్జీనియా ప్రాంతాలను భారీ తుపాను కుదిపేసింది. భీకర గాలులకు చాలా చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఆపై మంచు భారీగా కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. తుపాను ధాటికి ఐదుగురు మృతి చెందారు. దాదాపు 3 లక్షల ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులైయ్యారు. వ్యాపారసంస్థలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర కరోలినాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పశ్చిమ వర్జీనియాలో అధికారులు అత్యవసర […]

అమెరికాలో భారీ తుపాను.. ఐదుగురు మృతి
Follow us on

అమెరికాలోని నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, పశ్చిమ వర్జీనియా ప్రాంతాలను భారీ తుపాను కుదిపేసింది. భీకర గాలులకు చాలా చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. ఆపై మంచు భారీగా కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. తుపాను ధాటికి ఐదుగురు మృతి చెందారు. దాదాపు 3 లక్షల ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులైయ్యారు. వ్యాపారసంస్థలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉత్తర కరోలినాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పశ్చిమ వర్జీనియాలో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, జార్జియాల్లో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలిగింది.