అమ్మో! ఆవు కడుపులో ఏకంగా 45 కిలోల ప్లాస్టిక్

|

Aug 29, 2019 | 1:55 AM

ప్లాస్టిక్ ఎంతో డేంజర్ అని తెలిసినా దాన్ని దూరం చెయ్యడానికి ఆపసోపాలు పడుతున్నాం.  ప్లాస్టిక్ నిషేదం దిశగా తీసుకునే చర్యలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. అది మన జీవితాలకే కాదు మూగ జీవాల పాలిట కూడా శాపంలా తయారైంది. మనం తిన్న తర్వాత ఆహార పొట్లాలను, కుళ్లిపోయిన పండ్లను, కూరగాయలను ప్లాస్టిక్​ కవర్స్‌లో పెట్టి రోడ్లవెంట, చెత్తకుప్పలో పడేస్తున్నాం. ఆహారం దొరక్క మూగ జీవాలు ప్లాస్టిక్​ వస్తువులను తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ఇందుకు హరియాణాలో జరిగిన […]

అమ్మో! ఆవు కడుపులో ఏకంగా 45 కిలోల ప్లాస్టిక్
45 kgs of Plastic Removed From A Cow's Stomach
Follow us on

ప్లాస్టిక్ ఎంతో డేంజర్ అని తెలిసినా దాన్ని దూరం చెయ్యడానికి ఆపసోపాలు పడుతున్నాం.  ప్లాస్టిక్ నిషేదం దిశగా తీసుకునే చర్యలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. అది మన జీవితాలకే కాదు మూగ జీవాల పాలిట కూడా శాపంలా తయారైంది. మనం తిన్న తర్వాత ఆహార పొట్లాలను, కుళ్లిపోయిన పండ్లను, కూరగాయలను ప్లాస్టిక్​ కవర్స్‌లో పెట్టి రోడ్లవెంట, చెత్తకుప్పలో పడేస్తున్నాం. ఆహారం దొరక్క మూగ జీవాలు ప్లాస్టిక్​ వస్తువులను తిని తీవ్ర అస్వస్థతకు గురవుతున్నాయి. ఇందుకు హరియాణాలో జరిగిన ఘటన ఓ ఉదాహరణ మాత్రమే.

హరియాణా హిసార్​​లోని తలవండీ రాణా గోశాలకు చెందిన ఆవును చికిత్స నిమిత్తం పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పొట్ట లావుగా ఉండటం చూసి గోవు గర్భం దాల్చి ఉంటుందని అందరూ భావించారు. ఆపరేషన్ మొదలుపెట్టాక అసలు విషయం తెలిసి వైద్యులు నివ్వెరపోయారు. పొట్ట నిండా దాదాపు 45కిలోల చెత్త ఉంది. అందులో అధిక భాగం పాలిథీన్​దే. దీనితో పాటు ఇనుప వస్తువులు, రబ్బరు వస్తువులు కూడా ఉన్నాయి. ఆవు పొట్టలో ఉన్న చెత్తనంతా తొలగించేందుకు వైద్యులు దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి గోవు ప్రాణాలు కాపాడారు.