జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసు.. నలుగురికి ఉరి శిక్ష!

| Edited By:

Dec 20, 2019 | 6:18 PM

2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. పదేళ్ల క్రితం జైపూర్‌లో జరిగిన పేలుళ్లలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 170 మందికి పైగా గాయపడ్డారు. మహ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సల్మాన్, సైఫూర్ రెహ్మాన్ లను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా ప్రకటించబడ్డాడు. మరో ముగ్గురు నిందితులు ఢిల్లో లోని తీహార్ […]

జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసు.. నలుగురికి ఉరి శిక్ష!
Follow us on

2008 లో జైపూర్‌లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు తేలిన నలుగురికి రాజస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించారు. పదేళ్ల క్రితం జైపూర్‌లో జరిగిన పేలుళ్లలో 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 170 మందికి పైగా గాయపడ్డారు. మహ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సల్మాన్, సైఫూర్ రెహ్మాన్ లను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. షాబాజ్ హుస్సేన్ నిర్దోషిగా ప్రకటించబడ్డాడు.

మరో ముగ్గురు నిందితులు ఢిల్లో లోని తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుట్రకు సూత్రధారి ఉత్తరప్రదేశ్‌ లోని అజమ్‌ గఢ్ కు చెందిన మొహమ్మద్ అతిన్. అతను ఢిల్లీ లో జరిగిన బాట్ల హౌస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. దోషులు నలుగురు ఉత్తర ప్రదేశ్ నివాసితులు. వారు అతిన్ సూచనల మేరకు పేలుళ్లు జరిపారు. వారు పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి నగరంలోని తొమ్మిది ప్రదేశాలలో పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లు రాత్రి 7.20 నుంచి 7.45 మధ్య సంభవించాయి.