వైద్య కళాశాలల్లో కరోనా కలకలం.. 34 మంది విద్యార్థులకు సోకిన వైరస్..

| Edited By:

Jun 03, 2020 | 2:27 PM

హైదరాబాద్ లోని మూడు వైద్య కళాశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు. దీంతో అప్రమత్తమైన కళాశాలలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్య కళాశాలలు హాస్టల్ విద్యార్ధులని క్వారంటైన్ చేశారు. మూడు కళాశాలల్లో కలిపి 600 లకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే 34 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ అయింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉన్న 280 మందిని క్వారంటైన్ చేశారు. […]

వైద్య కళాశాలల్లో కరోనా కలకలం.. 34 మంది విద్యార్థులకు సోకిన వైరస్..
Follow us on

హైదరాబాద్ లోని మూడు వైద్య కళాశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు. దీంతో అప్రమత్తమైన కళాశాలలు అత్యవసర చర్యలు చేపట్టాయి. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్య కళాశాలలు హాస్టల్ విద్యార్ధులని క్వారంటైన్ చేశారు. మూడు కళాశాలల్లో కలిపి 600 లకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే 34 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ అయింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉన్న 280 మందిని క్వారంటైన్ చేశారు. గాంధీ కళాశాలతో సహా 250కి పైగా విద్యార్థులను క్వారంటైన్ కు తరలించారు. నిమ్స్ మెడికల్ కాలేజీలో 95 మంది క్వారంటైన్ లో ఉన్నారు.

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..