అందమా.. నీ పేరేమిటి.. నేనే పోలీస్..

| Edited By:

Jul 20, 2019 | 10:22 AM

2019 మిసెస్ ఇండియా పోటీలు అట్టహాసంగా ముగిసాయి. మొత్తం 20మంది పాల్గొన్న ఈ పోటీల్లో మిసెస్ ఇండియా కిరీటం మహారాష్ట్రకు చెందిన ప్రేమ విగ్నేష్ పాటిల్‌ను వరించింది. అందంతో పాటు విఙ్ఞానం కలిగిన ఆమె.. పుణ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటం విశేషం. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ నగరానికి చెందిన ప్రేమ విగ్నేష్.. కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. 2010లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరారు. ముంబయిలోని ఠాణే […]

అందమా.. నీ పేరేమిటి.. నేనే పోలీస్..
Follow us on

2019 మిసెస్ ఇండియా పోటీలు అట్టహాసంగా ముగిసాయి. మొత్తం 20మంది పాల్గొన్న ఈ పోటీల్లో మిసెస్ ఇండియా కిరీటం మహారాష్ట్రకు చెందిన ప్రేమ విగ్నేష్ పాటిల్‌ను వరించింది. అందంతో పాటు విఙ్ఞానం కలిగిన ఆమె.. పుణ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండటం విశేషం.

మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ నగరానికి చెందిన ప్రేమ విగ్నేష్.. కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. 2010లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీస్ శాఖలో చేరారు. ముంబయిలోని ఠాణే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన విగ్నేష్.. మహిళలపై దాడులు తగ్గించేందుకు తనవంతు కృషి చేశారు. ఈ తరువాతే ప్రత్యేక రక్షణ దళంలోనూ పనిచేసిన ఈమె ప్రస్తుతం పుణెలోని స్పెషల్ బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వరిస్తారు. 2014లో విగ్నేష్‌ అనే వ్యక్తిని ఈమె మనువాడింది. ప్రస్తుతం వీరికి రెండేళ్ల బాలుడు ఉన్నాడు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ప్రోద్భలంతోనే ఈ అందాల పోటీల్లో పాల్గొన్నా. ఇందుకోసం కుటుంబసభ్యులతో పాటు పోలీస్ శాఖ వారు తనకు ఎంతో అండగా నిలిచారు. హై హీల్స్‌తో ర్యాంప్ వాక్ చేయడం నాకు అతిపెద్ద సవాల్‌గా ఉండేది. అయితే సాధనతో ఈ సమస్యను అధిగమించాను. రోజూ దినపత్రికలు చదవడం నాకు ఎంతో కలిసొచ్చింది అని పేర్కొంది.