తెలంగాణలో 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు.. 9 మంది మృతి..

| Edited By:

Jul 12, 2020 | 5:51 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తెలంగాణలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.

తెలంగాణలో 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు.. 9 మంది మృతి..
Follow us on

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. తెలంగాణలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే 1,714 మంది  డిశ్చార్జ్‌ అయ్యారు.  కరోనాతో ఇవాళ తొమ్మిది   మంది మృతిచెందారు. ఒక్క హైదరాబాద్‌లోనే 736 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తెలంగాణలో మొత్తం పాజిటవ్‌ కేసుల సంఖ్య 33,402కు చేరింది. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 348కి పెరిగింది.

రాష్ట్రంలో 12,135 మంది  చికిత్స  పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కొలుకొని 20,919 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 736 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 101, సంగారెడ్డిలో 13,  ఖమ్మంలో 2,  వరంగల్ అర్బన్‌లో 20, వరంగల్ రూరల్‌లో 2,  నిర్మల్‌లో 2,కరీంనగర్‌లో 24,  జగిత్యాలలో 2,  యాదాద్రిలో 9, మహబూబాబాద్‌లో 5, పెద్దపల్లిలో 12, మెదక్‌లో 16, మంచిర్యాలలో 5, నల్గొండలో 12, రాజన్న సిరిసిల్లలో 24, ఆదిలాబాద్‌లో 8, ఆసీఫాబాద్‌ జిల్లాలో 1, నారాయణపేట్ జిల్లాలో 5, వికారాబాద్ జిల్లాలో 9, జనగాం జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో 12, వనపర్తి జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 7, గద్వాల జిల్లాలో 6 కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.