కరోనాను జయించిన 113 ఏళ్ల వృద్ధురాలు!

| Edited By:

May 13, 2020 | 12:47 PM

కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అయితే.. స్పెయిన్‌ దేశానికి చెందిన ఈ బామ్మ పేరు మారియా బ్రన్యాస్‌. వయసు

కరోనాను జయించిన 113 ఏళ్ల వృద్ధురాలు!
Follow us on

Oldest woman beat Coronavirus: కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి బలంగా తయారవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అయితే.. స్పెయిన్‌ దేశానికి చెందిన ఈ బామ్మ పేరు మారియా బ్రన్యాస్‌. వయసు 113 ఏళ్లు. అయితేనేం వైద్యుల చికిత్సకు తన మనోస్థైర్యాన్ని జోడించి కరోనాను జయించింది. ఒలోట్‌ నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉండగా తనకు సోకిన కోవిద్-19 ఇన్ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకుంది. దీంతో కరోనా పంజాకు చిక్కి విముక్తురాలైన అతి పెద్ద వయస్కురాలిగా పేరుగాంచింది.

వివరాల్లోకెళితే.. 1907లో జన్మించిన మారియా.. 1918లో 11 ఏళ్ల బాలికగా స్పానిష్‌ ఫ్లూ మహమ్మారిని కూడా కళ్లారా చూశారు. సరిగ్గా వందేళ్ల తర్వాత కరోనా రూపంలో వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు చిక్కినట్టే చిక్కి బయటపడ్డారు. మారియాకు ముగ్గురు సంతానం. 11 మంది మనవళ్లు/మనవరాళ్లు, 13 మంది ముని మనవళ్లు/మనవరాళ్లు ఉన్నారు. ఆమె మనవళ్లలో ఒకరికి 70 ఏళ్ల వయసు ఉంది.

[svt-event date=”13/05/2020,12:30PM” class=”svt-cd-green” ]