తెలంగాణ‌లో క‌రోనా వీర‌విహారం..ఒక్కరోజే 107 కేసులు నమోదు..

|

May 27, 2020 | 10:57 PM

తెలంగాణలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. బుధవారం కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 107 మందికి కోవిడ్-19 సోకింది.  రాష్ట్రంలో ఇప్పటి వరకూ క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య 63కు చేరింది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. అంతేకాక, మరో 19 మంది వలస కూలీలకు కూడా కోవిడ్ సోకింది. ఇప్పటి వరకూ […]

తెలంగాణ‌లో క‌రోనా వీర‌విహారం..ఒక్కరోజే 107 కేసులు నమోదు..
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. బుధవారం కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 107 మందికి కోవిడ్-19 సోకింది.  రాష్ట్రంలో ఇప్పటి వరకూ క‌రోనాతో చనిపోయిన వారి సంఖ్య 63కు చేరింది. ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకినట్లుగా అధికారులు నిర్ధారించారు. అంతేకాక, మరో 19 మంది వలస కూలీలకు కూడా కోవిడ్ సోకింది. ఇప్పటి వరకూ వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1321 అని బులెటిన్‌లో వివ‌రించారు. ప్ర‌జంట్ రాష్ట్రంలో 714 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనావైర‌స్ విషయంలో ప్రజలు భయాదోంళ‌న‌ల‌కు గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ రూల్స్ సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి అధికంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకవేళ రాబోయే రోజుల్లో క‌రోనా వ్యాప్తి అధిక‌మైన‌ప్ప‌టికీ, తగిన వైద్య సేవలు అందించడానికి ప్ర‌భుత్వం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు.