ఆ సంస్థలో పనిచేసే 1000 మందికి..!

| Edited By:

Jun 21, 2020 | 7:07 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ సంస్థలో పని చేసే సుమారు వెయ్యి మందికి కరోనా వైరస్ సోకడంతో

ఆ సంస్థలో పనిచేసే 1000 మందికి..!
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ సంస్థలో పని చేసే సుమారు వెయ్యి మందికి కరోనా వైరస్ సోకడంతో.. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు.. వారి కుటుంబ సభ్యులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. జర్మనీకి చెందిన మాంసం శుద్ధి సంస్థ టొన్నీస్‌లో పని చేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. సుమారు 1000 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ మూతపడగా.. అందులో పని చేసే 6,500 మంది ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను క్వారెంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జర్మనీలో ఇప్పటి వరకు 1.91లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. సుమారు 8వేల మంది మహమ్మారి కారణంగా మరణించారు.