దారుణం… విషం పెట్టి కోతులను చంపారు

|

Apr 25, 2020 | 5:45 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌ డౌన్ తో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు..‌ మూగ జీవాలు కూడా ఊహించ‌ని క‌ష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆకలితో అల‌మ‌టిస్తూ..వేస‌వి తాపానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థొతుల్లో పర్యాటక ప్రాంతాలలో కోతులు ప‌డుతోన్న‌ బాధలు చెప్ప‌లేనివే. వాటికి ఆహారం లేక బ‌క్క‌చిక్కిపోతున్నాయి. అవే కాదు రోడ్డు మీద తిరిగే శునకాలు, వన్యప్రాణులు, ర‌కర‌కాల‌ పక్షులు, కాకులు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి లాక్ డౌన్ తో కాలుష్యం బాధ […]

దారుణం... విషం పెట్టి కోతులను చంపారు
Follow us on

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌ డౌన్ తో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు..‌ మూగ జీవాలు కూడా ఊహించ‌ని క‌ష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆకలితో అల‌మ‌టిస్తూ..వేస‌వి తాపానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థొతుల్లో పర్యాటక ప్రాంతాలలో కోతులు ప‌డుతోన్న‌ బాధలు చెప్ప‌లేనివే. వాటికి ఆహారం లేక బ‌క్క‌చిక్కిపోతున్నాయి. అవే కాదు రోడ్డు మీద తిరిగే శునకాలు, వన్యప్రాణులు, ర‌కర‌కాల‌ పక్షులు, కాకులు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి లాక్ డౌన్ తో కాలుష్యం బాధ త‌గ్గినా..ఆక‌లి మాత్రం నిత్యం వెంటాడుతున్నాయి. కొంతమంది మంచి మ‌నుసున్న వాళ్లు అడ‌పాద‌డ‌పా వాటికి కూడా ఆహారం అందిస్తున్నారు.

అయితే ఆకలితో అలమటిస్తున్న కోతులకు విషంపెట్టి చంప‌డం తిరువణ్ణామలైలో కలకలం రేపింది. ఆక‌లితో కోతులు ఇళ్ల‌లోకి ప్రవేశిస్తుండ‌టంతో..మాన‌వ‌త్వం మ‌రిచిన‌ కొందరు తులకు అరటి పండులో విషం పెట్టి హతమార్చారు. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు చనిపోయి ఉండటాన్ని స్థానిక‌ గిరిజనులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు విచారణ చేపట్టారు. అయితే, ఈ కోతులు చనిపోయిన‌ ప్రాంతానికి కొంత‌దూరంలో అరటి పండ్లు పడి ఉండటంతో వాటిని పరిశీలించగా విషం ఉన్నట్టు గుర్తించారు.ఈ దారుణానికి ఒడిగట్టిన వారి కోసం అట‌వి సిబ్బంది గాలింపు చేపట్టారు.