గోదావరి లాంచీ ప్రమాదం: మృతుల కుటుంబాలకు మరో రూ.10 లక్షలు

|

Sep 23, 2019 | 8:43 PM

గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు మరో 10 లక్షలు బీమా సొమ్ము దక్కనుంది. ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమాను కల్పిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి  తెలిపారు.  రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. దీనికోసం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వద్ద బీమా సహాయకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. గోదావరిలో […]

గోదావరి లాంచీ ప్రమాదం: మృతుల కుటుంబాలకు మరో రూ.10 లక్షలు
Follow us on

గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు మరో 10 లక్షలు బీమా సొమ్ము దక్కనుంది. ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమాను కల్పిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి  తెలిపారు.  రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. దీనికోసం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వద్ద బీమా సహాయకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో పోలీసు శాఖ తప్పేమీ లేదని వెల్లడించారు. ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక మరిన్ని వివరాలు చెబుతామన్నారు. దర్యాప్తు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఎస్పీ అస్మి స్పష్టం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చనిపోయినవారికి రూ.10 లక్షలు..గాయపడ్డవారికి రూ.3 లక్షల నష్టపరిహారం వెల్లడించింది.