ఆఫ్ఘన్‌లో ఉగ్రదాడులు.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు..

| Edited By:

May 20, 2020 | 4:36 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పది మంది ప్రాణాలు

ఆఫ్ఘన్‌లో ఉగ్రదాడులు.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు..
Follow us on

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. మరోవైపు.. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఖోస్ట్ ప్రావిన్స్‌లోని కోర్చకో గ్రామంలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ఓ బాలిక తీవ్రంగా గాయపడినట్టు ప్రావిన్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కాగా.. ఈ సంఘటనకు రెండు గంటల ముందు కాబూల్‌కి ఉత్తరాన 55 కిలోమీటర్ల దూరంలోని ఖలాజై అనే గ్రామంలో ఉగ్రవాదులు ఏడుగురిని పొట్టనబెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో మరో 13 మందికి గాయాలయ్యాయి. ప్రావిన్స్ రాజధాని చరికార్ శివారులో రాత్రి 7 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చరికార్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ఆఫ్ఘన్లు ఉపవాస ప్రార్థనలు పాటిస్తున్న సమయంలోనే ముష్కరులు దాడులకు పాల్పడడం గమనార్హం.