‘స్విచ్ హిట్టింగ్’పై దుమారం.. ఆ షాట్ న్యాయబద్ధమైనదంటూ ఆసీస్ మాజీ కెప్టెన్‌కు కౌంటర్ ఇచ్చిన మ్యాక్సీ.!

'స్విచ్ హిట్టింగ్' సరైనది కాదని.. బౌలింగ్ టీమ్‌కు నష్టం చేకూరుస్తుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్ స్పందించాడు.

'స్విచ్ హిట్టింగ్'పై దుమారం.. ఆ షాట్ న్యాయబద్ధమైనదంటూ ఆసీస్ మాజీ కెప్టెన్‌కు కౌంటర్ ఇచ్చిన మ్యాక్సీ.!
Follow us

|

Updated on: Dec 03, 2020 | 9:49 PM

India Vs Australia 2020: ‘స్విచ్ హిట్టింగ్’ సరైనది కాదని.. బౌలింగ్ టీమ్‌కు నష్టం చేకూరుస్తుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్ స్పందించాడు. ‘స్విచ్ హిట్’ క్రికెట్ నియమ నిబంధనల్లో ఒకటని పేర్కొన్న మ్యాక్సీ.. అది న్యాయబద్ధమైన షాట్ అని చెప్పుకొచ్చాడు. రోజురోజుకూ బ్యాట్స్‌మెన్ మెరుగవుతున్నారని అన్నాడు. అప్పుడప్పడూ భారీ లక్ష్యాలను చేధించే క్రమంలో ఇలాంటి వైరటీ షాట్లు ఆడాల్సి వస్తుందని తెలిపాడు.

కాగా, ‘స్విచ్ హిట్‌’ పై ఇయాన్ ఛాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ షాట్ సరైనది కాదని, న్యాయవిరుద్ధమైన షాట్‌ అని, ఇది ఫీల్డింగ్ చేసే జట్టుకు నష్టం చేకూరుస్తుందని తెలిపాడు. వెంటనే ఈ షాట్‌ని రద్దు చేయాలని ఐసీసీని సూచించాడు. దీనిపై ఆటగాళ్లు ఇప్పటికీ ఫిర్యాదు చేయకపోవడం తనకు ఆశ్చర్యకరంగా ఉందన్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ ఈ షాట్ ఆడటంలో సిద్ధహస్తులని వివరించాడు.

Latest Articles