కనుబొమ్మల మధ్య ఉండే ఆ చిన్న భాగాన్ని ఏమంటారో తెలుసా..? 99శాతం మందికి తెలియదు..

మనం రోజూ అద్దంలో ముఖాన్ని చూసుకుంటాం కానీ రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆ చిన్న ప్రదేశం మన ఆరోగ్యాన్ని శాసిస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా..? సైన్స్ భాషలో గ్లాబెల్లా అని, యోగ శాస్త్రంలో ఆజ్ఞా చక్రం అని పిలిచే ఈ భాగం.. మన శరీరంలో ఒక శక్తివంతమైన కేంద్రం. అసలు ఇక్కడ మసాజ్ చేస్తే తలనొప్పి ఎందుకు తగ్గుతుంది? అనేది తెలుసుకుందాం..

కనుబొమ్మల మధ్య ఉండే ఆ చిన్న భాగాన్ని ఏమంటారో తెలుసా..? 99శాతం మందికి తెలియదు..
What Is The Glabella

Updated on: Apr 09, 2026 | 10:32 AM

మన ముఖంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే చాలామంది ఏమాత్రం పట్టించుకోని కనుబొమ్మల మధ్య ఉండే ఆ చిన్న ప్రదేశానికి వైద్యశాస్త్రం నుంచి ఆధ్యాత్మికత వరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ భాగాన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారు? అక్కడ మసాజ్ చేస్తే వచ్చే లాభాలేంటి? అనే విషయాలను చాలా మంది పట్టించుకోరు. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆ నుదురు భాగాన్ని శరీర నిర్మాణ శాస్త్రం ప్రకారం గ్లాబెల్లా అని పిలుస్తారు. అందం విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ ఇక్కడ నిలువుగా రెండు గీతలు ఏర్పడతాయి. వీటిని కాస్మెటిక్ నిపుణులు 11 లైన్స్ అని పిలుస్తారు. బొటాక్స్ వంటి సౌందర్య చికిత్సల్లో ఈ ముడతలను తొలగించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఆధ్యాత్మికంగా ఆజ్ఞా చక్రం

భారతీయ యోగ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్లాబెల్లా ప్రాంతాన్ని ఆజ్ఞా చక్రం లేదా మూడో కన్ను అని పిలుస్తారు. ఇది ఏకాగ్రతకు, స్పష్టమైన ఆలోచనా విధానానికి కేంద్రం. ఇక్కడ తిలకం లేదా బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయడమే. ఈ చక్రం సమతుల్యంగా ఉంటే మనిషిలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుందని నమ్ముతారు.

ఒత్తిడిని తగ్గించే మ్యాజిక్ పాయింట్

ఆయుర్వేదం, ఆక్యుప్రెషర్ వైద్యం ప్రకారం.. గ్లాబెల్లా ప్రాంతాన్ని సున్నితంగా మర్దించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో నాడీ వ్యవస్థ ముడిపడి ఉండటం వల్ల ఇక్కడ మసాజ్ చేస్తే తలనొప్పి, మైగ్రేన్ తగ్గుతాయి. రోజంతా కంప్యూటర్లు, మొబైల్స్ చూడటం వల్ల కళ్లకు కలిగే అలసటను ఇది తగ్గిస్తుంది. ఇక్కడ ఒత్తిడి కలిగించడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదలై, మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధం.

ఆరోగ్యాన్ని సూచించే అలారం

మీకు తరచుగా కనుబొమ్మల మధ్య నొప్పిగా లేదా టైట్‌గా అనిపిస్తోందా? అయితే అది మీ శరీరం ఇస్తున్న హెచ్చరిక కావచ్చు. మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు తెలియకుండానే కనుబొమ్మలను ముడివేస్తారు. ఇది గ్లాబెల్లా వద్ద నొప్పికి దారితీస్తుంది. మీకు కంటి చూపు సమస్యలు ఉన్నప్పుడు, వస్తువులను స్పష్టంగా చూడటానికి కనుబొమ్మలపై ఒత్తిడి పెంచుతారు.

గ్లాబెల్లా అనేది కేవలం ముఖంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన శారీరక, మానసిక స్థితికి ఒక అద్దం. ప్రతిరోజూ కాసేపు ఈ ప్రాంతాన్ని మసాజ్ చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

Follow Us