దొంగతనానికి వెళ్లి.. బొక్కబోర్లా పడ్డాడు! గ్రిల్స్‌లో ఇరుక్కుని నానా తంటాలు!

చోరీ చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుకవైపు ఉన్న గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నానా తంటాలు పడుతుండగా స్థానికులు అతడిని గమనించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది.

దొంగతనానికి వెళ్లి.. బొక్కబోర్లా పడ్డాడు! గ్రిల్స్‌లో ఇరుక్కుని నానా తంటాలు!
Thief Trapped In Grill

Updated on: Sep 16, 2026 | 10:15 PM

సూరత్: చోరీ చేయాలనే ఉద్దేశంతో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెనుకవైపు ఉన్న గ్రిల్స్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక నానా తంటాలు పడుతుండగా స్థానికులు అతడిని గమనించారు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది.

సూరత్‌లోని రాజారాంనగర్ సొసైటీలో ఓ NRIకి చెందిన ఇంట్లోకి ఓ వ్యక్తి చోరీ కోసం ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం అతడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే వెనుక భాగంలో ఏర్పాటు చేసిన గ్రిల్‌ వద్దకు చేరుకున్న సమయంలో అందులో చిక్కుకున్నాడు. అటు వెళ్లలేక.. ఇటు బయటకు రాలేక కొంతసేపు అక్కడే ఇరుక్కుపోయాడు. గ్రిల్స్‌లో చిక్కుకున్న వ్యక్తిని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అతడిని పట్టుకునే క్రమంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో వైరల్ అయిన తర్వాత, పరిస్థితిని సమీక్షించడానికి కపోదర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వీడియో నానా వరచ్చాకు చెందిన రాజారామ్‌నగర్ సొసైటీకి చెందినదని, ఈ ఘటన సుమారు పది రోజుల క్రితం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కపోదర పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎంఆర్ సోలంకి తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఇంటి యజమాని కిషోర్‌భాయ్‌ను కపోదర పోలీసులు సంప్రదించినట్లు తెలిసింది. నానా వరచ్చాలోని తన ఇల్లు చాలా కాలంగా మూసి ఉందని ఆయన పోలీసులకు తెలిపారు. ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని, లోపల నగదు గానీ, విలువైన వస్తువులు గానీ లేదని ఆయన చెప్పారు. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us