Left handers day: ఎడమ చేతి వాటం ఉన్నవారు షార్ప్‌గా ఉంటారా.? పరిశోధనల్లో ఏం తేలిందంటే..

|

Aug 13, 2024 | 7:00 AM

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం ఎడమ చేతి వాటం అలవాటుకు జీన్స్‌ ప్రధాన కారణమని తేలింది. ఇక ఎడమ చేతి వాటం ఉన్న వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది.? వారి మెదడు నిర్మాణంలో ఏమైనా తేడా ఉంటుందా.? అన్న అంశాలపై పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు. ‘కుడి, ఎడమ చేతి అలవాట్లను డిసైడ్​ చేసేది మెదడులో..

Left handers day: ఎడమ చేతి వాటం ఉన్నవారు షార్ప్‌గా ఉంటారా.? పరిశోధనల్లో ఏం తేలిందంటే..
Left Hand
Follow us on

ఎడమ చేతులతో డబ్బులు తీసుకుంటే.. కుడి చేయి ఏమైంది అని కోప్పడుతుంటారు. ఎడమ చేత్తో ఏదైనా పనిచేస్తుంటే తక్కువ చేసి చూస్తుంటారు. అయితే ఎడమ చేతి వాటం చాలా మందిలో ఉండడం సర్వ సాధారణం ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరిది ఎడమ చేతి వాటం అంటే మీరు నమ్ముతారా.? ఎడమ చేతి వాటం వారికి ప్రత్యేకంగా ఒక రోజు కూడా ఉందని మీకు తెలుసా. ప్రతీ ఏటా ఆగస్టు 13వ తేదీని ఎడమ చేతి వాటం దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంతకీ ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది.? ఎడమ చేతి వాటం ఉన్న వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందం..

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలిన వివరాల ప్రకారం ఎడమ చేతి వాటం అలవాటుకు జీన్స్‌ ప్రధాన కారణమని తేలింది. ఇక ఎడమ చేతి వాటం ఉన్న వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది.? వారి మెదడు నిర్మాణంలో ఏమైనా తేడా ఉంటుందా.? అన్న అంశాలపై పరిశోధకులు పరిశోధనలు నిర్వహించారు. ‘కుడి, ఎడమ చేతి అలవాట్లను డిసైడ్​ చేసేది మెదడులో ఉండే సైటో స్కెలిటన్​ అనే పదార్థమని పరిశోధకులు కనిపెట్టారు. కుడిచేతి వాటం, ఎడమ చేతి వాటం ఉన్న వారిలో ఆలోచనల్లో తేడాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఎడమ చేతి వాటం ఉన్న వారి మెదడులోని ఎడమ భాగాలు ఒకదానితో మరొకటి బాగా కలిసిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఎడమ చేతి వాటం ఉన్న వారుబాగా మాట్లాడుతారని పరిశోధనల్లో తేలింది. ఇక లెఫ్ట్‌ హాండర్స్‌కి పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఎడమ చేతి వాటం ఉన్న వారు చాలా స్మార్ట్‌గా ఆలోచిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా విషయాన్ని వీళ్లు చాలా త్వరగా అర్థం చేసుకుంటారంటా. అలాగే గాయాల నుంచి కోలుకోవడంలో కూడా లెప్ట్‌ హ్యాండర్స్‌ ముందుంటారు. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు.. బాక్సింగ్, టెన్నిస్, బేస్ బాల్ గేమ్స్‌లో బాగా రాణించగలుగుతారు. ఎడమ చేతి వాటం ఉన్న వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా గుర్తు పెట్టుకుంటారు.

ఎడమ చేతి వాటం ఉన్న వారిలో డ్రైవింగ్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయంటా. వీరిలో ఫొటోగ్రఫీ నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. లెఫ్ట్‌ హాండర్స్‌ టైపింగ్ స్పీడ్‌గా చేయగలుగుతారు. వీరికి వీడియో గేమ్స్‌ ఆడడం అంటే చాలా ఇష్టం. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లు లెక్కలను కూడా చాలా ఫాస్ట్‌గా సాల్వ్‌ చేయగలుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఐన్‌స్టీన్‌​,న్యూటన్, మేరీ క్యూరీ, అరిస్టాటిల్, అలాన్ ట్యూరింగ్ వంటి మేధావులంతా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..