Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.? వాస్తు దోషాలు ఉన్నట్లే..

|

Jul 18, 2024 | 8:15 PM

ప్రతీ ఒక్కరూ వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇంటి నిర్మాణమనే ఆలోచన రాగానే మనలో చాలా మంది వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. ఇంటి పునాది మొదలు గదుల నిర్మాణం వరకు అన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు...

Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.? వాస్తు దోషాలు ఉన్నట్లే..
Vastu
Follow us on

ప్రతీ ఒక్కరూ వాస్తుకు అనుగుణంగానే ఇంటి నిర్మాణాన్ని చేపడుతుంటారు. ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇంటి నిర్మాణమనే ఆలోచన రాగానే మనలో చాలా మంది వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. ఇంటి పునాది మొదలు గదుల నిర్మాణం వరకు అన్నీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత పర్‌ఫెక్ట్‌గా నిర్మించినా మనకు తెలియకుండానే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయి. ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాల ఆధారంగా ఈ వాస్తు దోషాలను గుర్తించవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో కుటుంబ సభ్యులు చీటికిమాటికి అనారోగ్య సమస్యలబారిన పడుతుంటే.. ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి. తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే.. ఇంట్లో ఉండేవారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తుంటాయి. ఇది కూడా వాస్తు దోషం కారణంగానే అని గుర్తించాలి.

* ఇక వాస్తు దోషాల కారణంగా ఆర్థికంగా విపరీతమైన సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎంత ఆదాయం వచ్చినా వచ్చిన డబ్బులు, వచ్చినట్లే ఖర్చవుతుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పులు పెరిగి పోవడం వంటి సంకేతాలు కూడా కనిపిస్తాయి.

* భార్యభర్తల మధ్య నిత్యం సఖ్యత లేకపోవడం, తరచూ ఏదోఒక గొడవ జరుగుతుండం కూడా వాస్తు దోషాలకు సంకేతంగా చెప్పొచ్చు. సంతానలేమి సమస్యలు, అన్నీ ఉన్నా ఏదో లేదనే భావన కలిగితే కూడా ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉన్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

* న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అనవసరమైన అంశాల ఇరుక్కొని ఇబ్బందులు పడడం కూడా వాస్తు లోపానికి సంకేతంగా చెప్పొచ్చని వాస్తు పండితులు అభిప్రాయపడుతున్నారు.

* ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తే. నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే ఉప్పును నీటిలో కలిపి ఇంట్లో ఫ్లోర్‌ని తుడవాలి. అలాగే ఇంట్లో ప్రతీ మూలన ఒక గాజు కప్పులో కొంత ఉప్పును వేసి పెట్టాలి. ఈ ఉప్పును వారం రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..