Railway Track: రైలు పట్టాల మధ్య కంకర ఎందుకు ఉంటుందో తెలుసా..?

|

Jun 28, 2024 | 3:15 PM

రైలు ప‌ట్టాలను మీరు ఎప్పుడైన గ‌మ‌నించారా? రైలు ప‌ట్టాల మ‌ధ్య కానీ, ప‌ట్టాల చుట్టు ప‌క్క‌ల‌ కంక‌ర రాళ్ల‌ను వేసి ఉంచుతారు. కానీ అవి ఎందుకు వేశారో అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం....

Railway Track: రైలు పట్టాల మధ్య కంకర ఎందుకు ఉంటుందో తెలుసా..?
Railway Track
Follow us on

ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? రైలు పట్టాల మధ్య.. రెండు వైపులా కంకర రాళ్లు ఎందుకుంటాయని..? ఒకప్పుడు బొగ్గుతో రైళ్లు నడిచేవి.. కాలక్రమేణ కరెంట్ సాయంతో నడిచే రైళ్లు వచ్చాయి. అంతేనా రైళ్లలో చాలా మార్పులు వచ్చాయి. సకల సౌకర్యాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో దూసుకెళ్లే.. ఎక్స్‌ప్రెస్, వందే భారత్, బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయి. అయినా పట్టాల చుట్టురా కంకర వేసే పద్దతి మాత్రం మారలేదు. దేశంలో ఏ మారుమూల రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి చూసినా.. ఆ కంకర రాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఈ రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ అని పిలుస్తారు. అంత భారీగా ఉండే ట్రైన్.. అన్ని భోగీలతో, పట్టాలపై వెళ్లే సమయంలో భారీ కంపనాలు ఏర్పడుతుంటాయి. దీని కారణంగా పెద్ద శబ్దంతో పాటు.. దగ్గర్లోని భవనాలు,  నిర్మాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఈ పదునైన రాళ్లను రైల్వేశాఖ వినియోగిస్తుంది. ఈ రాళ్లు శబ్ధం తీవ్రతతో పాటు కంపనాలను చాలావరకు తగ్గిస్తాయి.  ఇదొక్కటే కాకుండా.. ఇలా కంకర వేయడం వల్ల… పిచ్చి చెట్లు, కలుపు పెరిగే ఆస్కారం ఉండదు.

అంతేకాదు ఈ కంకర కారణంగా వర్షాకాలంలో పట్టాలపై నీరు నిలవదు. ఈ కంకర రాళ్లు మాత్రమే కాకుండా.. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్‌తో చేసిన పొడవాటి ప్లేట్‌లు కూడా  మీరు గమనించే ఉంటారు. ఆ ప్లేట్లపైనే రైల్వే ట్రాక్‌లు వేస్తారు. వీటిని స్లీపర్స్ అంటారు. ట్రాక్ బ్యాలస్ట్‌లు కూడా ఈ స్లీపర్‌లకు స్థిరత్వాన్ని అందించడంలో సాయపడతాయి.

మరి మెట్రోకు ఎందుకు ఉండవు….

మెట్రో స్టేషన్లను పరిశీలిస్తే.. పట్టాల మధ్య రాళ్లు ఉండవు. ఇందుకు కారణం.. ఇక్కడ నడిచే రైళ్లు పరిమిత వేగంతో నడుస్తాయి. వీల్ లోడ్ తట్టుకునే విధంగా.. మెట్రో ట్రాక్స్‌ను నిర్మిస్తారు. అంతే కాకుండా  మెట్రో స్టేషన్లలో రైల్వే ట్రాక్‌కు, ప్రయాణీకులకు మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉండదు. బ్యాలస్ట్ ఉంటే.. రాళ్లు ఎగిరి ప్రయాణికులకు తగిలే ప్రమాదం ఉంది. మెట్రో ట్రైన్స్ పొడవు, బరువు కూడా సాధారణ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటాయి.  అందుకు తగిన సాంకేతికతతో మెట్రో ట్రాక్ నిర్మాణం చేస్తారు. అందుకే రాళ్లు కనిపించవు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..